Naga Shaurya : నాగ‌శౌర్య ఈ హీరోయిన్ మేన‌ల్లుడే.. కానీ ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు ఎందుకంటే

Authored By mallesh | The Telugu News | Published on: July 16, 2022, 9:00 pm

Naga Shaurya : సీనియ‌ర్ న‌టి.. హీరోయిన్ ల‌తాశ్రీ గురించి ఇప్ప‌టి కుర్ర ప్రేక్ష‌కుల‌కు అంత‌గా తెలియ‌క‌పోవ‌చ్చు గానీ.. తొంబైలో ప్రేక్ష‌కుల‌కు బాగా సుప‌రిచిత‌మే. కెరీర్ స్టార్టింగ్ లో హీరోయిన్ గా న‌టించి మెప్పించింది. ఆ త‌ర్వాత క్ర‌మంగా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ఆక‌ట్టుకుంది. చాలా సినిమాల్లో చెల్లి పాత్ర‌లో మెరిసింది. య‌మ‌లీల‌, పోలీస్ భార్య‌, నెంబ‌ర్ వ‌న్, ఆ ఒక్క‌టీ అడ‌క్కు వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించింది. అంతేకాకుండా తెలుగుతో పాటు క‌న్న‌డ‌, హిందీ చిత్రాల్లో కూడా మొత్తంగా 70కి పైగా సినిమాల్లో న‌టించింది. ఇక ఓ జిమ్ ట్రైనర్‌ను ల‌వ్ మ్యారేజ్ చేసుకుంది. తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వ‌స్తోంది. చివ‌ర‌గా ఈవీవీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ అల్ల‌రి న‌రేష్ న‌టించిన అత్తిలి స‌త్తిబాబు.. ఎల్ కేజీ సినిమాలో న‌టిచింది.

కాగా ల‌తాశ్రీ విజయవాడలో పదో తరగతి చదివే రోజుల్లో సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ నూతన నటీనటులు కావాలని పేపర్‌లో వేసిన యాడ్ చూసి ఫొటోలు పంపించింద‌ట‌. దీంతో ఆ ఆడిష‌న్స్ లో సెలెక్ట్ కావ‌డం సినిమా చేయ‌డం జ‌రిగిపోయిందంట‌. ఇక ఆ త‌ర్వాత ల‌తాశ్రీ వరుస అవ‌కాశాల‌తో బిజీ అయ్యింది. అయితే హీరో నాగ‌శౌర్య మేన‌త్తే ల‌తాశ్రీ అని చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. ఇరు కుటుంబాల మ‌ధ్య రిలేష‌న్ లేక‌పోవ‌డంతో పెద్ద‌గా తెలియ‌దు. అయితే ఇరు కుటుంబాల మ‌ధ్య విభేదాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది, ఈ నేప‌థ్య‌లోనే ల‌తాశ్రీ చాలా ఇంట‌ర్వ్యూల్లో త‌న‌కు తోడ‌బుట్టిన అన్న‌య్య మాత్రమే ఉన్నాడ‌ని.. మిగ‌తా వాళ్ల పేర్లు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌దు. అయితే రీసెంట్ గా ఓ ఇంట‌ర్య్యూలో ఆమె ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంది.

Actress Latha Sree on Naga Shaurya Because of differences between

Actress Latha Sree on Naga Shaurya Because of differences between

Naga Shaurya : అంద‌రి సినిమాల‌తో పాటే త‌న సినిమాలు చూస్తా..

నాగ‌శౌర్య మేన‌ల్లుడా అని అడ‌గ్గా అందుకు స‌మాధానం ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. త‌న‌కు అన్న‌య్య ఉన్నాడ‌ని ఇండైరెక్ట్ గా చెప్పేసింది. అలాగే త‌న మేన‌ల్లుడి సినిమాలు చూస్తారా అని అడ‌గ్గా అంద‌రి సినిమాలు చూసిన‌ట్లే త‌న సినిమాలు కూడా చూస్తాన‌ని ప్రత్యేకం ఏమి లేద‌ని చెప్పుకొచ్చింది. కాగా నాగశౌర్య కుటుంబంతో ఎందుకు విభేదాలు వ‌చ్చాయి అని అడ‌గ్గా.. అవ‌న్నీ ఇప్పుడెందుకు.. నేను చెబితే దాన్ని మీరు మ‌రో ర‌కంగా రాస్తారు. ఇప్పుడ‌వ‌న్నీ ఎందుకు అని స‌మాధానం ఇచ్చింది. అయితే నాగశౌర్య తన మేనత్తను ఎందుకు దూరం పెట్టాడు రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందన్న విషయంపై క్లారిటీ ఇవ్వడానికి ఇష్ట‌ప‌డ‌లేదు.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp