Puri Jagannath : పూరీ జగన్నాథ్ దంపతుల విడాకులపై ఆయన ఏమన్నారంటే..!
Puri Jagannath : ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్‌లో పూరీ జగన్నాథ్ ఒకరు. రీసెంట్‌గా ఆయన లైగర్ అనే సినిమాని తెరకెక్కించగా, ఈచిత్రం మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కెరీర్ పరంగా పూరీ జగన్నాథ్ దూసుకుపోతుండగా, ఆయన పర్సనల్ లైఫ్‌లో కొన్ని డిస్ట్రబెన్స్ ఉన్నట్టు ప్రచారాలు నడుస్తున్నాయి. పూరీ – లావణ్య ల విడాకులు.. గత కొన్ని రోజుల నుంచి మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. పూరీ హీరోయిన్ ఛార్మీ కౌర్ తో సహజీవనం చేస్తున్నాడని, దీంతోనే తన భార్య లావణ్యకు విడాకులు ఇవ్వబోతున్నాడంటూ వార్తలు గుప్పుమన్నాయి.
పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ నటించిన చోర్ బజార్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్ లో జరగగా,ఆ వేడుకకు ముఖ్యఅతిధిగా హాజరయ్యాడు టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్. ఈవెంట్‌లో కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. కొడుకు మూవీ ప్రీరిలీజ్ జరుగుతుంటే అతను ముంబైలో ఉన్నాడని, ఆకాశ్ ను పట్టించుకోవా అంటూ మాట్లాడాడు. ఇక పూరీ భార్య లావణ్యపై ప్రశంసలు కురిపిస్తూ దేవత లాంటి తల్లికి అన్యాయం చేయోద్దంటూ కూడా పూరీ జగన్నాథ్ కు బండ్ల గణేష్ సూచించాడు. దీంతో పూరీ దంపతుల మధ్య విబేదాలు పీక్స్ కి చేరుకున్నాయా అనే అనుమానాలు తలెత్తాయి.
mberpet shankar anna clarity puri jagannadh divorce
Puri Jagannath : అవన్నీ అవాస్తవాలు..
తాజాగా పూరీ-లావణ్యలు విడాకుల వార్తలపై అంబర్ పేట్ శంకరన్న స్పందించాడు. పూరీ-లావణ్యలది ప్రేమ పెళ్లి అనే విషయం తెలిసిందే. ఇద్దరు ఇంట్లో నుంచి వచ్చేసి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు వారి పెళ్లి జరిపించింది ఈ అంబర్ పేట్ శంకరన్నే. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆయన పూరీ దంపతుల విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ఈ వార్తలన్నీ పుకార్లేనని, వారిద్దరు చాలా సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశాడు. కాగా, ఈ వార్తలపై పూరీ కుమారుడు ఆకాశ్ పూరీ కూడా ఇటీవల స్పందించాడు. ఈ వార్తలు అవాస్తవమని, కావాలనే కొందరు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని అన్నాడు. మా తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపాడు.