Tamannaah : త‌ళుకులీనే అందాల‌తో తెగ ర‌చ్చ చేస్తున్న త‌మ‌న్నా.. కుర్ర‌కారు హృద‌యాలు కొల్ల‌గొట్టేస్తున్నావుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tamannaah : త‌ళుకులీనే అందాల‌తో తెగ ర‌చ్చ చేస్తున్న త‌మ‌న్నా.. కుర్ర‌కారు హృద‌యాలు కొల్ల‌గొట్టేస్తున్నావుగా..!

Tamannaah : మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మడు ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లు అవుతుంది. అయిన‌ప్ప‌టికీ త‌న అందంచందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతున్నారు త‌మ‌న్నా. తాజాగా ఎఫ్ 3 సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు. మేని ఛాయతో మిల్క్ బ్యూటీగా ఫ్యాన్స్ ను ఫిదా చేసేస్తోన్నతమ్ము.. […]

 Authored By sandeep | The Telugu News | Updated on :16 July 2022,8:30 pm

Tamannaah : మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మడు ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లు అవుతుంది. అయిన‌ప్ప‌టికీ త‌న అందంచందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతున్నారు త‌మ‌న్నా. తాజాగా ఎఫ్ 3 సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు. మేని ఛాయతో మిల్క్ బ్యూటీగా ఫ్యాన్స్ ను ఫిదా చేసేస్తోన్నతమ్ము.. నెట్టింట అందాల ఆరబోతలో కూడా తగ్గేది లేదంటోంది. ఫుల్ బ్లాక్‌ డ్రెస్‌లో మిల్క్ వైట్ బ్యూటీ గ్లామర్‌ మాములుగా లేదు.

త‌మ‌న్నా గ్లామ‌ర్ చూసి కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి. ఈ బ్యూటీ క్యూట్ అందాలు మెస్మ‌రైజ్ చేస్తున్నాయి సౌందర్య ప్రియులు సలాం అనే అందం తమన్నాది. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రెటీల వరకూ ఈ పాలబుగ్గల .. పసిడి మెరుపుల సుందరిని పొగడకుండా ఉండలేదు. అంతటి అందం ఆమె సొంత. మెరుపులు మెరిపించే మేని ఛాయకు కేరాఫ్ అడ్రస్ తమన్నా. ఫ్యాన్స్‌ని, కుర్రకారుని తన డ్యాన్స్‌తో ఫిదా చేస్తోంది తమన్నా భాటియా. కెరీర్ బిగినింగ్ లోనే పెద్ద హీరోల సరసన మెరిసిన ఈ అమ్మడికి వరుసగా ఫ్లాప్‌లు తగలడంతో స్టార్‌ డమ్‌ కోల్పోయింది. అయితేనేం ఐటమ్ సాంగ్స్‌తో అందరికి కిక్కిచ్చిన తమన్నా..మళ్లీ వెంకీతో ఎఫ్‌3లో ఫామ్ లోకి వచ్చేసింది.

Tamannaah black dress looks are stunning

Tamannaah black dress looks are stunning

Tamannaah : మిల్కీ అందాలు..

ఇటీవ‌ల ఈ భామ ఆస్తులు అంతస్తుల గురించి సోషల్ మీడియాలో వార్త వైరల్ అయింది. తమన్నాకు ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన జుహూలో రూ.16.60 కోట్ల ఖరీదైన అపార్ట్మెంట్ ఉందట. దీని విస్తీర్ణం 80,778 చదరపు అడుగులు ఉంటుందట. ఇక తమన్నా ఆస్తి మొత్తం రూ.150 కోట్లకు పైగానే ఉంటుందని అంటున్నారు. ఆమెకు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ రూ.75.59 లక్షలు కాగా బీఎండబ్ల్యూ 320 ఐ – రూ.43.50 లక్షలు.. మెర్సిడేస్ బెంజ్ జి ఎల్ ఈ రూ.1.02 కోట్లు.. మిత్సు బిషి పేజర్ స్పోర్ట్స్ కార్ రూ.29.96 లక్షలు ఉన్నాయట. వీటితో పాటు తమన్నా దగ్గర ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద వజ్రం కూడా ఉందని తెలుస్తోంది. ఇక దీని విలువ రెండు కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంటున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది