Home » Entertainment » Actress Madhavi Latha Revealed Incident
Entertainment

Madhavi Latha : ట్రైన్ లో అతడు చేసిన పనికి షాక్ – హీరోయిన్ మాధవీలత సీరియస్ కామెంట్స్ ..!!

Authored By
aruna
The Telugu News | Published on: February 4, 2024, 5:00 pm
Advertisement

Madhavi Latha : హీరోయిన్ మాధవీ లత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నటిగా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఆమె ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగలేకపోయారు. కానీ ఆమె రెండు మూడు సినిమాలతో బాగా పాపులర్ అయ్యారు. అయినా ఎందుకో ఆమె కు సినీ ఆఫర్స్ రాలేదు. ఇలా ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ నుంచి దూరమయ్యారు. ఈ విధంగా మాధవీ లత ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలుసు. కొన్నిసార్లు ఆమె చేసే వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగుతుంటాయి. ఇలా ఇండస్ట్రీలో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా తరచు వార్తల్లో నిలుస్తారు.

Advertisement

ఇకపోతే మాధవీ లత గతంలో పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. పెళ్లి చేసుకోవాలంటే వయసు ఒకటే వస్తే సరిపోదని వయస్సుతోపాటు మానసికంగా శారీరకంగా కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనప్పుడే పెళ్లి చేసుకోవాలి అంటూ పెళ్లి గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. అలాగే తన జీవితంలో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ విషయాలను కూడా ఆమె వెల్లడించారు. మగవాళ్ళపై ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ ఉండడం మనం చాలాసార్లు విన్నం అలాగే ఈసారి కూడా మగవారికి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తను డ్రామా నేర్చుకుంటున్న సమయంలో తన లెక్చరర్ తనని ఒంటరిగా ఇంటికి రమ్మన్నాడని దీంతో షాక్ అయ్యాను.

స్టూడెంట్స్ తో ఎంతో రెస్పెక్ట్ గా ఉండే ఆ లెక్చరర్ తనను అలా అనడంతో ఆశ్చర్యపోయాను అని అన్నారు. అలాగే షాపింగ్ మాల్స్ లో కూడా తండ్రి వయసు ఉండే వారు రాసుకుంటూ తిరుగుతారని, యూత్ కి అంత ధైర్యం ఉండదు కానీ అంకుల్స్ ఆడవారితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. యూత్ కన్నా తండ్రి వయసు ఉన్నవారు ఆడవారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని ఆమె మండిపడ్డారు. తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవీ లత యూత్ కన్నా 40 సంవత్సరాల వయసున్న వ్యక్తులే ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు అని ఏదైనా చేయటానికి ఆడపిల్లను ఏమైనా అంటారని భయపడతారు కానీ అంకుల్స్ అలా కాదు. చాలా తెలివిగా తప్పించుకుంటారు అసలేమీ తెలియని వ్యక్తులు లాగా ప్రవర్తిస్తారు అని ఆమె అన్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి