Manchu lakshmi : మంచు లక్ష్మికి కరోనా.. ‘కరోనా బూచోడు నన్నూ పట్టుకున్నాడు’..!
Manchu lakshmi : టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కరోనా బారిన పడ్డారు. తనకు తేలికపాటి లక్షణాలు కనిపించగా వైద్య నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. తనకు కరోనా నిర్ధారణ అయిందని ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అందరూ… మన భయాల నుంచి పారిపోకుండా మనం ఫైట్ చేయాలని చెబుతూ ఉంటారు…
రెండేళ్లుగా దోబూచులాడుతున్న కరోనా బూచోడు ఎట్టకేలకు నన్నూ పట్టుకున్నాడు అని హాస్య ధోరణిలో చెప్పుకొచ్చారు. తాను ఎంతగానో కష్టపడి నేర్చుకున్న కలరి విద్యను కరోనాపై ప్రయోగిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లుగా చెబుతూ ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారు. వైద్యుల సలహాల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.

Actress Manchu lakshmi tested covid positive
తనను కలిసిన మిత్రులు, శ్రేయోభిలాషులందరూ దయ చేసి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటి వద్దనే సురక్షితంగా ఉండాలని ఆమె సూచించారు. మాస్క్ లతో పాటు భౌతిక నియమం వంటి కరోనా నిబంధనలను పాటించాలని కోరారు.