Hema | మంచు లక్ష్మీని అలా అన్నా స్పందించవా.. హేమ ఘాటు కౌంటర్
Hema | ‘దక్ష’ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో సీనియర్ సినీ జర్నలిస్ట్ వీఎస్ఎన్ మూర్తి వేసిన ప్రశ్నపై మంచు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మీరు 50 ఏళ్లకు దగ్గరవుతోన్న మహిళ, 12 ఏళ్ల కూతురు ఉండి ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడంపై మీరెలా స్పందిస్తారని జర్నలిస్టు అడగ్గా.. ‘ఇలాంటి ప్రశ్న అడగడానికి మీకెంత ధైర్యం. ఇదే ప్రశ్న మహేశ్‌బాబుని అడగ్గలరా.. మీకు మహిళలంటే అంత చులకనా… జర్నలిస్టు అయిండి ఇలాంటి ప్రశ్న వేస్తే మిమ్మల్ని చూసి జనాలు కూడా నేర్చుకుంటున్నారు’ అంటూ మంచు కడిగిపారేసింది.

#image_title
అయితే ఈ విషయంలో మంచు లక్ష్మిని సపోర్ట్ చేస్తూ హేమ కామెంట్స్ చేసింది. మీడియా వల్ల బాధపడిన వారిలో నేను కూడా ఉన్నాను. పెద్దగా చదువుకోని నాలాంటి వాళ్లు తెలియక ఏదైనా మాట్లాడితే అనుకోవచ్చు. కానీ బాగా చదువుకుని జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారు కూడా ఇలా మాట్లాడితే ఇంకేం అనుకోవాలి. ఏదో చమత్కారంగా స్నాక్స్‌ని భోజనంలా చేస్తారని అంటే దానికే ఆమెతో క్షమాపణలు చెప్పించుకున్న సినీ జర్నలిస్టులు మంచు లక్ష్మి వివాదంపై ఎలా స్పందిస్తారు.
కనీసం జర్నలిస్ట్ అసోసియేషన్లో ఉన్న లేడీ జర్నలిస్టులు కూడా దీన్ని ఖండించకపోవడం సిగ్గుచేటు. గతంలో ఇండస్ట్రీలోని ఆడవాళ్ల గురించి నీచంగా మాట్లాడిన ఓ వ్యక్తిని ప్రశ్నించినందుకు మాపై కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పారు. మంచు లక్ష్మి గురించి నీచంగా మాట్లాడిన జర్నలిస్టుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు. గతంలో సమంత, నాగచైతన్య గురించి వేణుస్వామి ఏదో అంటే జర్నలిస్టులు కంప్లైంట్ చేసి ఆయన క్షమాపణలు చెప్పేవరకు ఊరుకోలేదు. మరో సందర్భంలో యాంకర్ సుమతో క్షమాపణలు చెప్పించుకున్నారు. మరిప్పుడు ఓ జర్నలిస్టు పిచ్చి ప్రశ్నలు వేసి మహిళని అవమానిస్తే ‘మా’ అసోసియేషన్ ఎందుకు పట్టించుకోవడం లేదు’ అంటూ హేమ కాస్త ఘాటు కామెంట్స్ చేసింది.