
Actress Meena Decided To Donate Her Organs
Actress Meena : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పెద్దగా పరిచయం అక్కరలేని హీరోయిన్ మీనా.. ఈ నటికి ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకానొక సమయంలో అగ్రహీరోలు అందరితోనూ మీనా స్క్రీన్ షేర్ చేసుకుంది. సౌందర్య తర్వాత టాలీవుడ్‌లో మళ్లీ అంతటి స్టార్ డమ్‌ను సంపాదించుకుంది మీనా.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నమీనా కొన్నేళ్ల గ్యాప్ తీసుకుని మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. అయితే, అనుకోకుండా ఇటీవల మీనా భర్త మరణించారు.భర్త మరణంతో మీనా కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ నేపథ్యంలోనే మీనా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని మీనా తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ముందుగా తన భర్త గురించి ప్రస్తావించిన మీనా.. అవయవ దానం చేయాలనుకుంటున్నట్టు అందులో పేర్కొంది. తన భర్తకు గతంలో గుర్తుతెలియని వ్యక్తులు అవయవదానం చేయడం వల్లే ఆయన కొన్ని రోజులు జీవించగలిగారు అంటూ చెప్పుకొచ్చింది. అవయవ దానం అనేది ఒక గొప్ప పని అని చెబుతూనే తను కూడా అవయవ దానం చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ వెల్లడించింది. మీనా తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సంచలనంగా మారింది.
Actress Meena Decided To Donate Her Organs
వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా మీనా మాట్లాడుతూ.. నేను ఈరోజు అవయవ దానం చేయాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాను. మీరు కూడా ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. అని చెబుతూ మీనా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది.ఇతరుల ప్రాణాలను కాపాడటం కంటే గొప్ప సాయం ఇంకొకటి ఉండదు. మీరు కూడా దీనిపై ఆలోచిస్తారని ఆశిస్తున్నానంటూ పేర్కొంది.ఒక దాత ఎనిమిది మంది ప్రాణాలను కాపాడవచ్చు.అవయవ దానం చాలా గొప్ప నిర్ణయం అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటూ వివరించింది. ఇదిలాఉండగా మీనా తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
This website uses cookies.