Chiranjeevi : సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరు మాత్రమే మంచి పేరు తెచ్చుకుంటారు. అటువంటి వారికే అవకాశాలు వెంటపడుతుంటాయి. దీంతో బిజీబిజీగా మారిపోతారు. మరికొందరు ఒకటి రెండు సినిమాలతో సరిపెట్టుకుంటారు. తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ యాక్టర్ మోహిని కూడా ఆ కోవకు చెందుతారు. ఈ నటి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కారణం ఈ అమ్మడు తెలుగులో చేసింది రెండు సినిమాలే.. తొలి సినిమా నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘ఆదిత్య 369’ మూవీలో నటించారు. ఆ తర్వాత మెగాస్టార్ నటించిన ‘హిట్లర్’ సినిమాలో చిరుకు చెల్లెలిగా చేశారు.
హీరోయిన్ మోహిని తెలుగులో రెండు సినిమాలే చేసినా తమిళ, మళయాలం భాషల్లో కలిపి ఏకంగా 100కు పైగా చిత్రాల్లో నటించింది.ఈ నటి హిందువులకు గురువు అయిన రమణ మహర్షికి వరుసకు మనవరాలు అవుతుందని తెలుస్తోంది. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన మోహిని టాలీవుడ్‌లో తన సినీ కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోవడానికి పరోక్ష కారణం చిరంజీవి అని పేర్కొంది. ఇతర భాషల్లో ప్రేక్షకులు తనను చాలా బాగా ఆదరించారని చెప్పుకొచ్చారు.
హిట్లర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటించడం వలన తనకు అవకాశాలు రాలేదని, హీరోయిన్‌గా తనను తీసుకోవాలని ఎంతమంది డైరెక్టర్లను అడిగినా నువ్వు చిరుకు చెల్లెలి క్యారెక్టర్ చేశావు.. మళ్లీ హీరోయిన్‌గా అంటే జనం అంగీకరించరని పలువురు రిజక్ట్ చేశారని చెప్పుకొచ్చారు. చిరుకు చెల్లెలి క్యారెక్టర్ చేయడమే తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని లేదంటే తనకు కూడా మంచి అవకాశాలు వచ్చి హీరోయిన్‌గా గుర్తింపు పొందేదానిని అని చెప్పుకొచ్చారు సీనియర్ యాక్టర్ మోహిని.. కాగా, మోహిని కామెంట్స్‌పై చిరు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
Kichcha Sudeep : కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ మీడియాకు లెఫ్ రైట్ ఇచ్చాడు. ఆయన నటించిన మ్యాక్స్…
Good News : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఒంటరి బాలికల కోసం మెరిట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్…
Rashmika Mandanna : పుష్ప 2 సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా కూడా ఆ సినిమా చుట్టూ…
Smart Watches : ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ స్మార్ట్ గా ఉండాలని స్మార్ట్ వాచ్ ని పెట్టుకొని స్టైల్…
Allu Arjun : ఓ పక్క పుష్ప 2 వసూళ్లతో సరికొత్త సంచలన రికార్డులు క్రియేట్ చేస్తుంటే మరోపక్క అల్లు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ధనుర్మాసంలో గ్రహాల సంచారం గ్రహాల సంయోగం కారణంగా బాదశ రాశుల వారి పై…
Water After Fruits : పండ్లు తిన్న ఆరోగ్యానికి చాలా మంచిది. దాదా పండి రకాల పండ్లు ఆరోగ్యంగా మేలు…
Zodiac Sign : 2025 నవగ్రహాలు తమ రాశులను మారుస్తున్నాయి. ఇటువంటి సమయంలో మరి కొన్ని రాశులు అనుకూల పరిస్థితులు…
This website uses cookies.