Chiranjeevi : చిరంజీవి వల్లే నా సినీ కెరీర్ నాశనమైంది.. సంచలన కామెంట్స్ చేసిన అలనాటి హీరోయిన్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : చిరంజీవి వల్లే నా సినీ కెరీర్ నాశనమైంది.. సంచలన కామెంట్స్ చేసిన అలనాటి హీరోయిన్!

 Authored By mallesh | The Telugu News | Updated on :3 January 2022,6:20 pm

Chiranjeevi : సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరు మాత్రమే మంచి పేరు తెచ్చుకుంటారు. అటువంటి వారికే అవకాశాలు వెంటపడుతుంటాయి. దీంతో బిజీబిజీగా మారిపోతారు. మరికొందరు ఒకటి రెండు సినిమాలతో సరిపెట్టుకుంటారు. తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ యాక్టర్ మోహిని కూడా ఆ కోవకు చెందుతారు. ఈ నటి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కారణం ఈ అమ్మడు తెలుగులో చేసింది రెండు సినిమాలే.. తొలి సినిమా నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘ఆదిత్య 369’ మూవీలో నటించారు. ఆ తర్వాత మెగాస్టార్ నటించిన ‘హిట్లర్’ సినిమాలో చిరుకు చెల్లెలిగా చేశారు.

Chiranjeevi : చిరు సినిమా వల్లే నా కెరీర్ పోయింది

హీరోయిన్ మోహిని తెలుగులో రెండు సినిమాలే చేసినా తమిళ, మళయాలం భాషల్లో కలిపి ఏకంగా 100కు పైగా చిత్రాల్లో నటించింది.ఈ నటి హిందువులకు గురువు అయిన రమణ మహర్షికి వరుసకు మనవరాలు అవుతుందని తెలుస్తోంది. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన మోహిని టాలీవుడ్‌లో తన సినీ కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోవడానికి పరోక్ష కారణం చిరంజీవి అని పేర్కొంది. ఇతర భాషల్లో ప్రేక్షకులు తనను చాలా బాగా ఆదరించారని చెప్పుకొచ్చారు.

chiranjeevi

chiranjeevi

హిట్లర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటించడం వలన తనకు అవకాశాలు రాలేదని, హీరోయిన్‌గా తనను తీసుకోవాలని ఎంతమంది డైరెక్టర్లను అడిగినా నువ్వు చిరుకు చెల్లెలి క్యారెక్టర్ చేశావు.. మళ్లీ హీరోయిన్‌గా అంటే జనం అంగీకరించరని పలువురు రిజక్ట్ చేశారని చెప్పుకొచ్చారు. చిరుకు చెల్లెలి క్యారెక్టర్ చేయడమే తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని లేదంటే తనకు కూడా మంచి అవకాశాలు వచ్చి హీరోయిన్‌గా గుర్తింపు పొందేదానిని అని చెప్పుకొచ్చారు సీనియర్ యాక్టర్ మోహిని.. కాగా, మోహిని కామెంట్స్‌పై చిరు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Tags :

    mallesh

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది