Home » Entertainment » Actress Pragathi Mass Dance Ar Dj
Entertainment

Pragathi : ప్రగతి మాస్ డ్యాన్స్.. చీరలో ఉన్నా కూడా ఊపుడం ఆపలేదు! వీడియో

Authored By
Cinema Desk
The Telugu News | Published on: October 27, 2021, 1:10 pm
Advertisement

వెండితెరపై ప్రగతి ఎంత సాఫ్ట్‌గా ఉంటుందో ఎలాంటి పాత్రలు వేస్తుంటుందో అందరికీ తెలిసిందే.అయితే ఆమె ఇమేజ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కరోనా పుణ్యమా, లాక్డౌన్ వల్లో ఏమో గానీ ప్రగతి ఫేట్ మారిపోయింది. ఆమె గత ఏడాది చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాను తను వర్కవట్లు, డ్యాన్సులతో ఊపు ఊపేసింది. చీరపైకి ఎత్తి డ్యాన్సులు చేసినా లుంగీ కట్టుకుని మాస్ స్టెప్పులు వేసినా కూడా ప్రగతి స్టైల్ వేరు.

Advertisement

Actress Pragathi Mass Dance Ar DJ

అయితే ఆమె అలా తన అందాలను కాపాడుకుంటూ ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టడంతో ఎంతో మంది ఆశ్చర్యపోయారు. నాలుగు పదుల వయసులోనూ ఇంతటి డెడికేషన్ ఏంటి అని అవాక్కయ్యారు. తనను చూసి ఎంతో మంది ఇన్ స్పైర్ అవుతున్నారు అని, అందుకే ఇంకా ఫిట్ నెస్ మీద శ్రద్ద పెట్టాను.. అందరికీ ఫిట్‌గా ఉండటం ఎంతో ముఖ్యమని ఆరోగ్య సూత్రాలను చెప్పింది. తనకు చిన్నప్పటి నుంచి కూడా డ్యాన్సులు అంటే ఇష్టమని ప్రగతి చెప్పేది.

Advertisement

Pragathi రోడ్డు మీద మాస్ స్టెప్పులతో ప్రగతి హల్చల్

pragathi-has come to industry after marriage

అయితే తాజాగా రోడ్డు మీదే ప్రగతి రెచ్చిపోయింది. డీజేతో పాటు మాస్ స్టెప్పులు వేసింది. షూటింగ్ సెట్‌లో భాగంగా మాస్ స్టెప్పులు వేసి చీరలో అదరగొట్టేసింది ప్రగతి. ఇప్పుడు ఆమె షేర్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఏం చేయాలని అనిపిస్తే అది చేసేయాలి.. మనలో ఉన్న ఆ పిచ్చిని బయటకు తీయాలి అంటూ ప్రగతి దుమ్ములేపేసింది. ప్రస్తుతం ప్రగతి తమిళ, తెలుగు సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. ఈ వీడియో మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి