బాత్ టబ్‌లో చిలిపి పనులు.. ప్రణీత నుంచి ఇలా ఎవ్వరూ ఊహించి ఉండరు!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

బాత్ టబ్‌లో చిలిపి పనులు.. ప్రణీత నుంచి ఇలా ఎవ్వరూ ఊహించి ఉండరు!!

హీరోయిన్ ప్రణీత అంటే అందరికీ ఓ అభిప్రాయం ఉంటుంది. ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ యువతను ఆకట్టుకుంటుంది. పైగా లాక్డౌన్‌లో చేసిన మంచి పనులతో ప్రణీత గొప్ప పేరు తెచ్చుకుంది. ప్రణీత చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ఆమెపై అందరికీ గౌరవం ఏర్పడింది. అలా ప్రణీతను ఎంతో మంది ఇష్టపడటం ప్రారంభించారు. ప్రణీత కూడా ఆ గౌరవాన్ని నిలుపుకుంటూనే ఎక్కడా కూడా హద్దులు దాటకుండా ప్రవర్తిస్తూ వచ్చింది. మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ ప్రేక్షకులైతే ప్రణీతను ప్రత్యేకంగా […]

 Authored By uday | The Telugu News | Updated on :24 December 2020,5:26 pm

హీరోయిన్ ప్రణీత అంటే అందరికీ ఓ అభిప్రాయం ఉంటుంది. ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ యువతను ఆకట్టుకుంటుంది. పైగా లాక్డౌన్‌లో చేసిన మంచి పనులతో ప్రణీత గొప్ప పేరు తెచ్చుకుంది. ప్రణీత చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ఆమెపై అందరికీ గౌరవం ఏర్పడింది. అలా ప్రణీతను ఎంతో మంది ఇష్టపడటం ప్రారంభించారు. ప్రణీత కూడా ఆ గౌరవాన్ని నిలుపుకుంటూనే ఎక్కడా కూడా హద్దులు దాటకుండా ప్రవర్తిస్తూ వచ్చింది. మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ ప్రేక్షకులైతే ప్రణీతను ప్రత్యేకంగా ఆరాధిస్తుంటారు.

బాత్ టబ్‌లో చిలిపి పనులు ప్రణీత నుంచి ఇలా ఎవ్వరూ ఊహించి ఉండరు

Actress Pranitha shares bathtub pic

అలాంటి ప్రణీత తాజాగా ఓ ట్రెండ్‌ను క్రియేట్ చేద్దామని ప్రయత్నించింది. ఏదైనా ఫోటో అడగండి.. షేర్ చేస్తాను అని చెప్పుకొచ్చింది. ఓ వైపు సమంత కూడా ఇలాంటి ఓ ట్రెండ్‌నే ప్రారంభించింది. అలా సమంత తనను ఫ్యాన్స్ అడిగిన ఫోటోలను షేర్ చేసింది. ప్రణీత కూడా అదే దారిలో పయనించింది. నెటిజన్లకు అలా ఇచ్చిన బంపర్ ఆఫర్‌ను బాగానే వాడుకున్నారు. ప్రణీతను రకరకాల ఫోటోలను అడిగారు ఫ్యాన్స్. అయినా కూడా ఏ మాత్రం చిరాకు పడకుండా అన్ని ఫోటోలను షేర్ చేసింది.

ఇష్టమైన నటుడు ఎవరని అడిగితే పవన్ కళ్యాణ్ ఫోటోను పంపించింది. అత్తారింటికి దారేది స్టిల్‌ను షేర్ చేసింది ప్రణీత. పదో తరగతి మార్క్ షీట్‌ను అడిగితే పంపించింది. సోషల్ మీడియాలో షేర్ చేద్దామనుకుని చేయకుండా ఉన్న ఫోటోను పంపించండని అడిగాడు ఓ నెటిజన్. అప్పుడు ప్రణీత పంపిన ఓ ఫోటో అందరినీ షాక్‌కు గురి చేసింది. స్నానం చేస్తూ బాత్ టబ్‌లో చిన్న పిల్లలా పోజులు పెడుతూ చిలిపి పనులు చేస్తున్న ఫోటోను షేర్ చేసి ఆశ్చర్యపరిచింది.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది