
actress rajitha shares her experiences in life
Rajitha : సీనియర్ నటి రజిత ఇటివల తన జీవితంలో జరిగిన షాకింగ్ విషయాలను చెప్పి బాధపడింది. ఇండస్ట్రీలో దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా ఉన్న రజిత సీనియర్ ఎన్.టి.ఆర్ తో తప్ప అప్పటి తరం హీరోల నుంచి నేటి తరం యంగ్ హీరోల వరకు అందరితోను కలిసి స్క్రీన్ పంచుకుంది. అక్కినేని ఫ్యామిలీలో అయితే నాగేశ్వర రావు దగ్గర్నుంచి ఆయన మనవడు అక్కినేని నాగ చైతన్య వరకు సినిమాలు చేసినట్టు చెప్పుకొచ్చింది రజిత. తెలుగులో ఈమె ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పించింది.
కొందరు రెండు మూడు సినిమాలు చేసి కాస్త పాపులారిటీ రాగానే హీరోయిన్‌గా ట్రై చేయాలనుకుంటారు. దాని కోసం ఫాంలో హీరోలతోనో దర్శక, నిర్మాతలతోనో సిఫార్సు చేయించుకుంటుంటారు. కానీ రజిత మాత్రం ఈ రకంగా ఎప్పుడూ ట్రై చేయలేదు. తనకు వస్తున్న ప్రతీ అవకాశాన్ని అందుపుచ్చుకొని పాత్రకు తగ్గట్టు తనలోని నటిని పూర్తి స్థాయిలో బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేసింది తప్ప ఎప్పుడు హీరోయిన్ అవ్వాలని వెంపర్లాడలేదు. అయినా రజిత హీరోయిన్ రేంజ్‌లో తెలుగు సినిమాలలో పాపులారిటీ తెచ్చుకుంది.
actress rajitha shares her experiences in life
అయితే తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను ఇటీవల బయట పెట్టింది. ఒకసారి మద్రాస్ నుంచి హైదరాబాద్ ట్రైన్ లో వస్తున్న సమయంలో వాష్ రూమ్ వెళ్లి వచ్చేటప్పుడు ఒక ఆకతాయి నన్ను గట్టిగా పట్టుకొని హగ్ చేసుకొని ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించాడట. ఈ సంఘటన తో హడలిపోయినట్టు చెప్పింది. అప్పటి నుంచి తనకు ట్రైన్ ఫోబియా పట్టుకుందని చెప్పిన రజిత మరోసారి టీసీ అభిమానంతో ఆర్‌ఏసీ టికెట్ కన్ఫమ్ చేసి ‘మీరు విజయవాడ వరకు నాతోనే కూర్చుని ప్రయాణం చేయాలి’ అనగానే ఇబ్బంది పడినట్టు రజిత చెప్పుకొచ్చింది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.