YSRCP : ప్రస్తుతం వైఎస్సార్సీపీ పార్టీ నేతలు కానీ.. కార్యకర్తలు కానీ.. వైసీపీ చెందిన వాళ్లు ఎవ్వరైనా సరే.. కొంచెం నోరు దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే.. అసలే అధికారంలో ఉన్న పార్టీ.. వాళ్లు ఏమాత్రం నోరు జారినా.. అది పార్టీకే కాదు.. ప్రభుత్వానికి కూడా ఇబ్బందే. అందుకే.. పార్టీ నేతలు ఏం మాట్లాడినా కాస్త ఆచీతూచీ అడుగు వేస్తూ మాట్లాడాలి. ఏమాత్రం వాళ్లు నోరుజారిన.. ప్రతిపక్ష నేతలు దాన్నే పట్టుకొని రాద్ధాంతం చేస్తారు.. రచ్చ రచ్చ చేస్తారు.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తెగ ప్రయత్నిస్తారు. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. వైఎస్సార్సీపీ పార్టీని అడ్డంగా ఇరికించేశారు. ఇప్పుడు అడ్డంగా ఇరికిపోయాక.. ఎంత గింజుకుంటే మాత్రం ఏంటి లాభం.
అసలే.. చంద్రబాబు నాయుడు కష్టాల్లో ఉన్నారు. పార్టీ పరువు పోయింది. అసలు పార్టీయే నామరూపం లేకుండా పోయింది ఏపీలో. ఇప్పుడిప్పుడే పార్టీని ఏపీలో బలపరచడం కోసం తెగ కష్టాలు పడుతున్న చంద్రబాబుకు… అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఆయనకు అడ్డంగా వైసీపీ నేతలు దొరికిపోతున్నారు. చంద్రబాబుకు వైసీపీ అనుకోకుండానే మైలేజీ ఇస్తోంది. అసలు.. చంద్రబాబు వల్లనే వ్యాక్సినేషన్ కోసం హాస్పిటల్స్ వద్ద జనాలు బారులు తీరారని వైసీపీ నేతలు చెప్పడం.. ఖచ్చితంగా చంద్రబాబుకే ప్లస్.
చంద్రబాబు నాయుడు కరోనా వ్యాక్సిన్ నే పట్టుకున్నారు. కరోనా వ్యాక్సినేషన్ గురించే ఆయన ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. నిజానికి.. కరోనా వ్యాక్సినేషన్ అనేది కేంద్రానికి సంబంధించింది. దాంతో రాష్ట్రానికి సంబంధం లేదు. అయినా సరే.. రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను ఇరుకున పెట్టడం కోసం చంద్రబాబు పదే పదే వ్యాక్సినేషన్ గురించి విమర్శిస్తున్నారు. వ్యాక్సినేషన్ విషయంలో వైసీపీ ఘోరంగా విఫలం అయిందని చంద్రబాబు విమర్శించినప్పుడు వైసీపీ నేతలు పట్టించుకోకుండా ఉన్నా బాగుండేది కానీ.. వాళ్లు చంద్రబాబు విమర్శలను తిప్పి కొట్టేందుకు ప్రయత్నించడమే పెద్ద తప్పిదం అయిపోయింది. అదే చంద్రబాబుకు అనుకూలంగా మారింది.
చంద్రబాబు మాటలు వినే ప్రస్తుతం జనాలు.. వ్యాక్సినేషన్ కోసం క్యూ కడుతున్నారు. ఓవైపు సీఎం జగన్, ఏపీ మంత్రులు.. వ్యాక్సినేషన్ తమ పరిధిలో లేదని చెప్పినా కూడా జనం అవేమీ పట్టించుకోకుండా… వ్యాక్సిన్ కోసం వ్యాక్సిన్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. కావాలనే.. వ్యాక్సినేషన్ అనే అస్త్రాన్ని వాడుకొని చంద్రబాబు.. ప్రభుత్వంపై దాడి చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతున్నా… ఆయన ట్రాప్ లో వైసీపీ నేతలు పడిపోయారు.. అనేది అక్షర సత్యం.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.