Rajitha : విజయవాడ నుండి వ‌స్తుండ‌గా ఒక‌డు న‌న్ను… షాకినింగ్ విషయాలు చెప్పిన రజిత

Authored By vamana sai | The Telugu News | Published on: May 12, 2021, 7:20 pm

Rajitha : సీనియర్ నటి రజిత ఇటివల తన జీవితంలో జరిగిన షాకింగ్ విషయాలను చెప్పి బాధపడింది. ఇండస్ట్రీలో దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా ఉన్న రజిత సీనియర్ ఎన్.టి.ఆర్ తో తప్ప అప్పటి తరం హీరోల నుంచి నేటి తరం యంగ్ హీరోల వరకు అందరితోను కలిసి స్క్రీన్ పంచుకుంది. అక్కినేని ఫ్యామిలీలో అయితే నాగేశ్వర రావు దగ్గర్నుంచి ఆయన మనవడు అక్కినేని నాగ చైతన్య వరకు సినిమాలు చేసినట్టు చెప్పుకొచ్చింది రజిత. తెలుగులో ఈమె ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పించింది.

కొందరు రెండు మూడు సినిమాలు చేసి కాస్త పాపులారిటీ రాగానే హీరోయిన్‌గా ట్రై చేయాలనుకుంటారు. దాని కోసం ఫాంలో హీరోలతోనో దర్శక, నిర్మాతలతోనో సిఫార్సు చేయించుకుంటుంటారు. కానీ రజిత మాత్రం ఈ రకంగా ఎప్పుడూ ట్రై చేయలేదు. తనకు వస్తున్న ప్రతీ అవకాశాన్ని అందుపుచ్చుకొని పాత్రకు తగ్గట్టు తనలోని నటిని పూర్తి స్థాయిలో బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేసింది తప్ప ఎప్పుడు హీరోయిన్ అవ్వాలని వెంపర్లాడలేదు. అయినా రజిత హీరోయిన్ రేంజ్‌లో తెలుగు సినిమాలలో పాపులారిటీ తెచ్చుకుంది.

actress rajitha shares her experiences in life

actress rajitha shares her experiences in life

Rajitha : రజితకు ట్రైన్ ఫోబియా పట్టుకుంది అప్పటి నుంచే..!

అయితే తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను ఇటీవల బయట పెట్టింది. ఒకసారి మద్రాస్ నుంచి హైదరాబాద్‌ ట్రైన్ లో వస్తున్న సమయంలో వాష్‌ రూమ్ వెళ్లి వచ్చేటప్పుడు ఒక ఆకతాయి నన్ను గట్టిగా పట్టుకొని హగ్‌ చేసుకొని ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించాడట. ఈ సంఘటన తో హడలిపోయినట్టు చెప్పింది. అప్పటి నుంచి తనకు ట్రైన్ ఫోబియా పట్టుకుందని చెప్పిన రజిత మరోసారి టీసీ అభిమానంతో ఆర్‌ఏసీ టికెట్‌ కన్ఫమ్ చేసి ‘మీరు విజయవాడ వరకు నాతోనే కూర్చుని ప్రయాణం చేయాలి’ అనగానే ఇబ్బంది పడినట్టు రజిత చెప్పుకొచ్చింది.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp