Sadaa : స‌మంత విడాకులు తీసుకోవ‌డంపై స్పందించిన స‌దా.. ఇంత మాట అనేసిందేంటి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sadaa : స‌మంత విడాకులు తీసుకోవ‌డంపై స్పందించిన స‌దా.. ఇంత మాట అనేసిందేంటి..?

 Authored By mallesh | The Telugu News | Updated on :21 August 2022,7:20 pm

Sadaa : తన వివాహంపై సదా సంచలన కామెంట్స్ చేసింది. తనకు ఎలాంటి వ్యక్తి భర్తగా రావాలో ఒక క్లారిటీ ఉందని పేర్కొంది. అంతేకాకుండా ఈరోజుల్లో పెళ్లి చేసుకుని ఎంత మంది కలిసి ఉంటున్నారని పేర్కొంది. అంతేకాకుండా పెళ్లి విషయంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

Sadaa : నా లైఫ్ నా చేతిలోనే ఉంది..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సదా తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకుంది. జయం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సదా.. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది. తొలి విజయం తర్వాత సదా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ బ్యూటీలో స్పెషల్ క్వాలిటీ ఏదైనా ఉందంటే… ఏ క్యారెక్టర్ కైనా ఇట్టే కుదిరిపోతుంది.తనలోని నటన ద్వారా ఎన్నో సినిమాలకు ఊపిరిపోసింది.మరీ ముఖ్యంగా మొదటి సినిమా జయంలో అమ్ముడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్‌కి సినీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఫిదా అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హీరో మాధవన్‌తో చేసిన ప్రియసఖి సినిమాలో అమ్మడు టూ హాట్ గా కనిపించింది.అప్పటివరకు జయం సినిమాలో లంగా ఓణీతో కనిపించిన సదా..

Actress Sadaa Response To Samantha Divorce

Actress Sadaa Response To Samantha Divorce

ప్రియసఖి సినిమాలో మాత్రం చెడ్డీలు, మిడ్డీలు ధరించి ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆ తర్వాత అపరిచితుడు సినిమాతో మళ్లీ తన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ వేసుకుంది.అయితే, ఈ సినిమా తర్వాత ఎందుకో తెలియదు కానీ సదాకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. తన వయసుకు మించిన స్టార్ హీరోలతోనే అమ్మడు సినిమాలు చేయడం కెరీయర్ కు మైనస్ అయ్యిందని జోరుగా ప్రచారం సాగింది. ఇటీవల హలో వరల్డ్ అనే వెబ్‌సిరీస్‌తో వచ్చిన సదా.. ప్రమోషన్స్‌లో భాగంగా తన పెళ్లి గురించి సంచలన కామెంట్స్ చేసింది.

ప్రస్తుతం పదిమంది పెళ్లి చేసుకుంటే అందులో ఐదుగురు మాత్రమే కలిసి ఉంటున్నారని. మిగతా ఐదుగురు విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతుకుతున్నారని బాంబ్ పేల్చింది. ఈ కామెంట్స్ పరోక్షంగా సామ్ చై విడాకులపై చేసినవని కొందరు అంటున్నారు. అంతేకాకుండా తనకు కాబోయే ఎలా ఉండాలో సదా చెప్పుకొచ్చింది.‘నా జీవితం నా చేతుల్లోనే ఉంది. నా లైఫ్ నేను చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాను.పార్టీలకు పబ్బు లకు వెళ్ళను. మందు తాగను.నా జీవితం నాకు నచ్చినట్లే బతకాలనుకుంటున్నాను. ఎవరో వచ్చి నా జీవితాన్ని ఉద్ధరించాలని అస్సలు కోరుకోను. కానీ నాకు కాబోయే భర్త వెజిటేరియన్‌గా ఉండాలని కోరుకుంటున్నట్టు సదా స్పష్టం చేసింది.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది