samantha : ఉపాసన పోస్ట్ పై సమంత రియాక్షన్.. నెట్టింట్లో వైరల్ అవుతున్నకామెంట్!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 7, 2021, 1:00 pm

samantha  : మెగా కోడలు, నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఓవైపు అపోలో ఆసుపత్రి బాధ్యతలను చేపడుతూనే మరోవైపు సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూనే ఉంటారు. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‏గా ఉంటూ ఆరోగ్యం గురించి ముఖ్యంగా ఫిట్‏నెస్ గురించి జాగ్రత్తలు చెబుతూనే, ఆయుర్వేద వైద్యం, జంతువుల సంరక్షణ గురించి జనాలకు సూచనలు ఇస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఇంత బిజీగా ఉండే ఉపాసన, టాలీవుడ్ లోనే పలువురు హీరోయిన్ లతో కూడా టచ్ లో ఉంటుంది.

ముఖ్యంగా సమంత ఉపానస మధ్య మంచి స్నేహం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఉపాసన పెట్టిన ఓ పోస్ట్ పై సామ్ చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రస్తుతం తన సోదరి అనుష్ పాల పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్న ఉపాసన…. ఒకప్పటి తన వివాహా విశేషాలను గుర్తు చేసుకుంటూ ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. తొమ్మిదేళ్ళ క్రితం తన పెళ్లి సమయంలో పోచమ్మ గుడికి వెళ్లినప్పుడు ధరించిన దుస్తులనే తాను మళ్ళీ రీక్రియేట్ చేసి ఇప్పుడు తన సోదరి పెళ్లి వేడుకలలో ధరించినట్లు చెప్పుకొచ్చింది. దుస్తులను పదే పదే వేసుకోవడం, వాటిని జాగ్రత్తగా భద్రపరచడం తనకు ఎంతో ఇష్టమని తెలిపింది.

actress samantha comments over upasana instagram post goes viral in social media

actress samantha comments over upasana instagram post goes viral in social media

samantha  : బ్యూటిఫుల్ అంటూ సమంత కామెంట్:

విలువైన వస్తువులను ఎక్కువ కాలం దాచుకోవడం తనకు గర్వంగా ఉంటుందని పేర్కొంటూ డ్రెస్ కు సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ పోస్ట్‌కు సమంత బ్యూటీఫుల్ అంటూ రిప్లై ఇచ్చింది.సమంత గత కొద్ది రోజులుగా ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతున్నట్లే ఇప్పుడు ఈ కామెంట్ కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా ఉపాసన సోదరి అనుష్ పాల పెళ్లి వేడుకలు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దోమకొండలో జరుగుతున్న ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా హాజరవుతున్నారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp