actress samantha comments over upasana instagram post goes viral in social media
samantha : మెగా కోడలు, నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఓవైపు అపోలో ఆసుపత్రి బాధ్యతలను చేపడుతూనే మరోవైపు సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూనే ఉంటారు. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్యం గురించి ముఖ్యంగా ఫిట్నెస్ గురించి జాగ్రత్తలు చెబుతూనే, ఆయుర్వేద వైద్యం, జంతువుల సంరక్షణ గురించి జనాలకు సూచనలు ఇస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఇంత బిజీగా ఉండే ఉపాసన, టాలీవుడ్ లోనే పలువురు హీరోయిన్ లతో కూడా టచ్ లో ఉంటుంది.
ముఖ్యంగా సమంత ఉపానస మధ్య మంచి స్నేహం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఉపాసన పెట్టిన ఓ పోస్ట్ పై సామ్ చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రస్తుతం తన సోదరి అనుష్ పాల పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్న ఉపాసన…. ఒకప్పటి తన వివాహా విశేషాలను గుర్తు చేసుకుంటూ ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. తొమ్మిదేళ్ళ క్రితం తన పెళ్లి సమయంలో పోచమ్మ గుడికి వెళ్లినప్పుడు ధరించిన దుస్తులనే తాను మళ్ళీ రీక్రియేట్ చేసి ఇప్పుడు తన సోదరి పెళ్లి వేడుకలలో ధరించినట్లు చెప్పుకొచ్చింది. దుస్తులను పదే పదే వేసుకోవడం, వాటిని జాగ్రత్తగా భద్రపరచడం తనకు ఎంతో ఇష్టమని తెలిపింది.
actress samantha comments over upasana instagram post goes viral in social media
విలువైన వస్తువులను ఎక్కువ కాలం దాచుకోవడం తనకు గర్వంగా ఉంటుందని పేర్కొంటూ డ్రెస్ కు సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ పోస్ట్‌కు సమంత బ్యూటీఫుల్ అంటూ రిప్లై ఇచ్చింది.సమంత గత కొద్ది రోజులుగా ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతున్నట్లే ఇప్పుడు ఈ కామెంట్ కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా ఉపాసన సోదరి అనుష్ పాల పెళ్లి వేడుకలు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దోమకొండలో జరుగుతున్న ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా హాజరవుతున్నారు.
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
This website uses cookies.