Intinti Gruhalakshmi 7 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 డిసెంబర్ 2021, మంగళవారం 496 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లాస్య.. నందుకు అల్టిమేటం జారీ చేయడంతో ఏం చేయాలో అర్థం కాదు నందుకు. సోఫాలో కూర్చొని ఉంటాడు. ఇంతలో అందరూ వస్తారు. బ్యాగులు పట్టుకొని వస్తారు. దీంతో ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు నందు. మేం బయలుదేరింది మన ఇంటికి కాదు.. తులసి ఉన్న కాటేజీకి అంటారు. అదేంటి నా దగ్గర ఉండలేకా లేక తులసి దగ్గర ఉండాలనా అంటాడు నందు. నీ దగ్గర ఉండలేకే.. తులసి ఉన్న కాటేజీకి వెళ్తున్నాం అంటారు. మేము.. నువ్వు, లాస్య ఉన్నచోట ఉండలేం. మాకు తులసి దగ్గర ఉండటమే మంచిది అనిపిస్తోంది అంటాడు పరందామయ్య. నీ దగ్గర ఉండటానికి పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు అంటుంది అనసూయ. నువ్వు ఏమనుకోపోతే.. తులసి ఉన్న కాటేజీకి వెళ్లి ప్రశాంతంగా ఉంటాం అంటుంది అనసూయ. మీరిద్దరూ ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అంటుంది.
తుసి చీరలు సర్దుతుండగా అందరూ వచ్చి సర్ ప్రైజ్ ఇస్తారు. దీంతో తులసి షాక్ అవుతుంది. అదేంటి.. కొడుకు దగ్గరే ఉంటాము అన్నారు కదా అత్తయ్య అంటే. ఇప్పుడు కూతురు దగ్గర ఉంటాం. నువ్వు వద్దంటావా అంటుంది తులసి. జైలు నుంచి విడుదల అయినట్టుగా ఉంది ఇప్పుడు అంటుంది అనసూయ. అందరూ సరదాగా గడుపుతారు. తర్వాత తులసి గార్డెన్ కు వెళ్తుంది. అక్కడ అన్నీ గులాబీ చెట్లు కనిపిస్తాయి. వాటిని చూసి తెగ మురిసిపోతుంది తులసి. ఈ పూలు ఎంత బాగున్నాయో.. చూస్తుంటే ముచ్చటగా ఉంది. ఈ పూల వల్ల ప్రకృతికి అందం వస్తుందో లేక ప్రకృతి వల్ల పూలకు అందం వచ్చిందో తెలియట్లేదు అనుకుంటుంది. ఈ పూలు కోసుకుందామంటే ఎవరైనా ఏమైనా అంటారేమో అని టెన్షన్ పడుతుంది. ఇంతలో కోసుకోండి.. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనరు. హ్యాపీగా కోసుకోండి అంటాడు అద్వైత కృష్ణ.
కృష్ణ గారు మీరు ఇక్కడ అనేసరికి. నేను నా గురువులాగానే. సర్వంతరయామి. అంతటా ఉంటాను.. అంటాడు. అడగకుండానే మీకు పూలు కోసుకునే అవకాశం ఇచ్చాను కానీ.. ఏం లాభం. నన్ను ఒక కప్పు కాఫీకి కూడా పిలవలేదు అంటాడు కృష్ణ. అయ్యో.. నా హడావుడిలో పడి మరిచిపోయాను.. అంటుంది తులసి.
ఏది ఏమైనా.. ఎంతటి కష్టానయినా పాజిటివ్ గా తీసుకునే మీ మానసిక స్థైర్యం నాకు బాగా నచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీలా గుండె నిబ్బరంతో ధైర్యంగా ఉండటం అందరికీ సాధ్యం కాదు అంటాడు కృష్ణ. కానీ.. తులసికి ఆయన ఏం చెబుతున్నాడో అర్థం కాదు.
మరోవైపు కుటుంబ సభ్యులందరికీ తులసికి క్యాన్సర్ ఉందన్న విషయం తెలుస్తుంది. దీంతో అందరూ వెక్కి వెక్కి ఏడుస్తారు. అమ్మకే ఎందుకు ఇన్ని కష్టాలు. అమ్మకు అందరూ లోకువే. చివరకు ఆ దేవుడికి కూడా మమ్మీ లోకువా.. అంటుంది దివ్య. మమ్మీని ఈ పరిస్థితుల్లో చూసి నేను తట్టుకోలేను అంటుంది దివ్య.
ఏది ఏమైనా.. అమ్మకు ఎట్టిపరిస్థితుల్లో ఈ విషయం తెలియకూడదని అభి అందరితో అంటాడు. మనం తన వెనుక ఉండాలి. తనను గెలిపించాలి.. అంటాడు అభి. పొరపాటున కూడా మామ్ ముందు డల్ గా ఉండొద్దు. కన్నీళ్లు పెట్టుకోవద్దు. నానమ్మ ముఖ్యంగా నువ్వు.. అంటాడు అభి.
అద్వైత కృష్ణ.. అమ్మకు ఈ విషయం చెప్పకుండా చూసుకోవాలి అంటాడు అభి. వెంటనే వెళ్లి డాక్టర్ కు చెప్పు నాన్న అని నందుతో ప్రేమ్ అంటాడు. కట్ చేస్తే.. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని డాక్టర్ ను అడుగుతుంది తులసి. మీ మెడికల్ రిపోర్ట్స్ గురించి అంటాడు డాక్టర్.
వేరే ఎవరైనా అయితే.. రిపోర్ట్స్ లో ప్రాబ్లమ్ చూడగానే దైర్యం కోల్పోతారు. నాకేంట్రా దేవుడా ఈ శిక్ష అని అనుకుంటారు.. అనగానే నా రిపోర్ట్స్ గురించి మీరేమని అనుకుంటున్నారు అని అడుగుతుంది తులసి. దీంతో మీకు క్యాన్సర్ తులసి అని చెబుతాడు అద్వైత కృష్ణ. దీంతో తులసి షాక్ అవుతుంది.
ఇక విధంగా చెప్పాలంటే ప్రాబ్లమ్ అంత చిన్నదేమీ కాదు. అలాగని మేము దాన్ని అలా వదిలేయం. మా సాధ్యమైనంత వరకు మేము ప్రయత్నిస్తాం అని చెబుతాడు డాక్టర్. ఏంటి అలా చూస్తున్నావు తులసి అని అడుగుతాడు డాక్టర్. అవును.. మీకు క్యాన్సర్ ఉన్న విషయం మీకు ఇంతవరకు తెలియదా అని అడుగుతాడు డాక్టర్.
దీంతో తెలియదు అంటుంది తులసి. దీంతో క్యాన్సర్ తో పోరాడటానికి నువ్వు సిద్ధపడాల్సిందే అని ధైర్యం చెబుతాడు డాక్టర్. నాకు ఇంకా బతకడానికి ఎంత సమయం ఉంది అని అడుగుతుంది తులసి. చావు అనేది రావాల్సినప్పుడే వస్తుంది. ఆగమన్నా ఆగదు అంటాడు డాక్టర్. దీంతో సూసైడ్ చేసుకోవడానికి తులసి రైలు పట్టాల మీదికి వెళ్తుంది. రైలు పట్టాల మధ్య కూర్చొని ఏడుస్తుంది. ఇంతలోనే రైలు వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.