ఓ పక్క పుష్ప 2 వసూళ్లు 1400 కోట్లు దాటి మరిన్ని రికార్డులకు దూసుకెళ్తుంది. మరోపక్క ఆ సినిమా వల్ల తాము పొందిన ఎక్స్ పీరియన్స్ ని షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు కొందరు. పుష్ప 2 సినిమాలో జాతర సీన్ అందరినీ సర్ ప్రైజ్ చేసింది. సినిమాలో అల్లు అర్జున్ పూనకాలతో ఊగిపోవడం కాదు చూస్తున్న ఆడియన్స్ ని కూడా అదే రేంజ్ లో ఊగిపోయేలా చేశాడు. ఐతే ఆ టైం లో కొందరికి ఒంటి మీద నిజంగా దేవుడు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటివి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఐతే పుష్ప 2 చూస్తున్న ఒక యువ నటికి అలాంటి ఎక్స్ పీరియన్స్ అయ్యిందట. ఐతే అది తనకు కాదు తన పక్కన ఉన్న మహిళకు పూనకాలు వచ్చి సామీ సామీ అని గట్టిగా అరిచేసిందట. అవతల పక్క ఆమె భర్త కాస్త జాగ్రత్త పడటంతో ఆమె మీద పడలేదట. ఈ విషయాన్నే సోషల్ మీడియాలో షేర్ చేసింది యువ నటి సం యుక్త షణ్ముగనాథన్.
నటిగా బిగ్ బాస్ తమిళ కంటెస్టెంట్ గా సంయుక్త పాపులర్ కాగా లేటెస్ట్ గా పుష్ప 2 సినిమా టైం లో తనకు జరిగిన అనుభవం గురించి ఆమె సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. తన పక్కన కూర్చున్న ఒక మహిళకు పూనకాలు రాగా వెంటనే తను బాల్కానీ నుంచి 10 రూపాయల టికెట్ దగ్గరకు వెళ్లి కూర్చున్నా అని అన్నది. ఐతే ఆమె పెట్టిన ఆ కామెంట్స్ కి ఇంకా 10 రూపాయల టికెట్ అమ్ముతున్నారా ఎక్కడ అంటూ నెటిజన్లు ఆడుకుంటున్నారు.
ఏది ఏమైనా సంయుక్తకు పుష్ప 2 ఎక్స్ పీరియన్స్ నిజంగానే ఎప్పటికీ మర్చిపోలేనిదిగా చేసిందని చెప్పొచ్చు. థియేటర్ లో జనాలు సైతం ఊగిపోయే రేంజ్ లో అల్లు అర్జున్ నటన ఉంది. ఐతే ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ లీగల్ ఇష్యూస్ లో ఇరుక్కున్నాడని తెలిసిందే. Pushpa 2, Allu Arjun, Samyuktha Shanmukhanathan,
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్‌గా…
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ జపాన్ లో మాట్లాడాడు.. అక్కడ తన ఫ్యాన్స్ ని ప్రేక్షకులను విష్ చేస్తూ…
Realme 14x 5G : ప్రస్తుతం చాలా మంది కూడా మంచి ఫోన్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.…
YCP : జమిలి ఎన్నికల విషయంలో దేశంలో ఇపుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇండియా…
Neha Shetty : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ సినిమా ప్రస్తుతం…
Fruit Salads : ప్రస్తుత కాలంలో ఫ్రూట్ సలాడ్స్ ను కలిపి తింటూఉంటారు. కానీ ఇలా తినవచ్చా లేదా అనేది…
TTD : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వైకుంఠ దర్శనానికి ముఖ్యమైన ఏర్పాట్లను ప్రకటించింది. జనవరి…
Ashwin : ఇటీవల చాలా మంది ప్లేయర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెబుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా…
This website uses cookies.