YCP : జమిలి ఎన్నికల విషయంలో దేశంలో ఇపుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు అన్నీ కూడా జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. అసలు ఈ బిల్లుకి పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అర్హత లేదని కూడా గట్టిగా వాదిస్తున్నాయి. తెలంగాణ పరిస్థితి ఎలా ఉన్నా.. ఏపీలో మాత్రం రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం ఉంది. అయితే.. ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే.. ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే చర్చ జరుగుతోంది.ఏపీలో ప్రస్తుతం మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాటిల్లో టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కూటమిలో బీజేపీ ఉన్నా.. ఓట్లు, సీట్లు మాత్రం ఈ రెండు పార్టీల కంటే తక్కువే. మరోవైపు వైసీపీ ఉంది.
వైసీపీ సింగిల్ పోటీ చేసి 2019లో ఘనవిజయం సాధించింది. 2024లో మాత్రం ఊహించని స్థాయిలో పరాజయం పాలైంది. ఓటమి తర్వాత కొన్నిరోజులు కామ్‌గా ఉన్న వైసీపీ నేతలు.. ఇటీవల యాక్టివ్ అయ్యారు. జమిలి ప్రకటనలపై ఆశగా ఎదురుచూస్తున్నారు. జమిలి ఎన్నికల పట్ల వైసీపీ సానుకూలంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో.. జగన్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే పనిలో పడ్డారు. అటు కేడర్ కూడా గతంలో పోలిస్తే.. కాస్త యాక్టివ్ అయ్యింది. జమిలి ఎన్నికలు జరిగితే తప్పకుండా మేలు జరుగుతుందని వైసీపీ భావిస్తోంది. బిల్లుని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే ఎస్పీ తృణమూల్ కాంగ్రెస్ డీఎంకే, శరద్ పవార్ కి చెందిన ఎన్సీపీ కూడా జమిలి వద్దు అని స్పష్టం చేసింది.
లోక్ సభలో వైసీపీకి ఆ విధంగా నలుగురు ఎంపీలు ఉన్నారు. వైసీపీ అయితే జమిలి ఎన్నికలకు మద్దతుగానే ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఆ పార్టీ కీలక నాయకుడు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి 2027లోనే జమిలి ఎన్నికలు వస్తాయని తరచూ చెబుతున్నారు. వైసీపీ మాత్రం ముందస్తు ఎన్నికలు ఉంటాయని నమ్మకంగా చెబుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ బిల్లు పాస్ కాకపోవడంతో వైసీపీకి షాక్ తగిలినట్లు అయింది. జమిలి ఎన్నికలపై బోలెడు ఆశలు పెట్టుకుని వైసిపి. ఎన్నికలు సమీపంలోనే ఉండడంతో వైసిపి నుంచి నేతలు వెళ్లిపోవడాన్ని నియంత్రించవచ్చని భావించింది. కానీ వైసీపీ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది.
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ జపాన్ లో మాట్లాడాడు.. అక్కడ తన ఫ్యాన్స్ ని ప్రేక్షకులను విష్ చేస్తూ…
Realme 14x 5G : ప్రస్తుతం చాలా మంది కూడా మంచి ఫోన్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.…
ఓ పక్క పుష్ప 2 వసూళ్లు 1400 కోట్లు దాటి మరిన్ని రికార్డులకు దూసుకెళ్తుంది. మరోపక్క ఆ సినిమా వల్ల…
Neha Shetty : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ సినిమా ప్రస్తుతం…
Fruit Salads : ప్రస్తుత కాలంలో ఫ్రూట్ సలాడ్స్ ను కలిపి తింటూఉంటారు. కానీ ఇలా తినవచ్చా లేదా అనేది…
TTD : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వైకుంఠ దర్శనానికి ముఖ్యమైన ఏర్పాట్లను ప్రకటించింది. జనవరి…
Ashwin : ఇటీవల చాలా మంది ప్లేయర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెబుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా…
Cancer Vaccine : ఈ శతాబ్దపు గొప్ప ఆవిష్కరణ. రష్యా ప్రభుత్వం తన స్వంత క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు…
This website uses cookies.