Surekha vani : వీకెండ్ రచ్చ.. బార్‌లో సురేఖా వాణి హల్చల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Surekha vani : వీకెండ్ రచ్చ.. బార్‌లో సురేఖా వాణి హల్చల్

 Authored By bkalyan | The Telugu News | Updated on :18 January 2021,12:16 pm

నటి సురేఖా వాణి తెరపై కంటే బయటే ఎక్కువగా రచ్చ చేస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియాను సైతం ఓ ఊపు ఊపేస్తోంది. తన కూతురు సుప్రితతో కలిసి సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. ఈ మధ్య షూటింగ్‌లలోనూ సురేఖా వాణి తన కూతురు సుప్రిత కనిపించేలా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఈ తల్లీ కూతుళ్లు చేసే సందడికి సపరేట్ ఫాలోయింగ్ ఉంటుంది. తల్లికూతుళ్లలా కాకుండా ఫ్రెండ్స్‌లా ఈ ఇద్దరూ కలిసి తిరుగుతుంటారు.

Actress Surekha vani In Posh Nosh Bar

Actress Surekha vani In Posh Nosh Bar

కూతురి కంటే ఎక్కువగా సురేఖా వాణి మీదే ప్రశంసలు కురుస్తుంటాయి. ఇంకా యంగ్ హీరోయిన్‌లా ఉంది, అసలు సుప్రితకు అమ్మలా లేదని సురేఖా వాణిని పొగుడుతుంటారు. సురేఖా వాణి కూడా ట్రెండీగా ఉంటూ పార్టీలు, పబ్‌లు, బీచ్‌లంటూ తిరుగుతూ ఉంటుంది. ఇక వీకెండ్ వస్తే చాలు సురేఖా వాణి ఏదో పబ్‌ లేదా క్లబ్‌లో రచ్చ చేస్తూ ఉంటుంది. ఆ మధ్య అయితే గోవాలో తన కూతురితో కలిసి చేసిన రచ్చ, షేర్ చేసిన ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

తాజాగా సురేఖా వాణి ఈ వీకెండ్‌కు పాష్ నోష్ బార్‌కు వెళ్లినట్టుంది. అక్కడ వెరైటీ మందును తాగినట్టుంది. వెరైటీగా తయారు చేసిన కాక్ టైల్‌ను వీడియో తీసి షేర్ చేసింది. మొత్తానికి సురేఖా వాణి మాత్రం ఇలా తన లైఫ్‌ను భల్లేగా ఎంజాయ్ చేస్తోంది. సినిమా షూటింగ్‌లతో ఓ వైపు బిజీగా ఉంటూనే ఇలా తన కూతురితో కలిసి రచ్చ చేస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో అయితే సురేఖా వాణి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సురేఖా వాణి పార్టీ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

    bkalyan

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది