Adipurush Movie : ఆదిపురుష్ ఎంతకి అమ్మేసారో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ !

Authored By aruna | The Telugu News | Published on: June 7, 2023, 10:00 am

Adipurush Movie : టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. త్వరలోనే ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఇటీవల తిరుపతిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా చేశారు. ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా నటిస్తుంది. అలాగే రన్వీర్ సింగ్ రావాలని పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాని హిందీలో భారీ బడ్జెట్ తో టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించారు.

ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా 550 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. డిజిటల్ సాటిలైట్స్ రైట్స్ త్వరలో ఆదిపురుష్ సినిమాకి ఏకంగా 250 కోట్ల రూపాయలు వచ్చాయట. ఇక ఈ సినిమా తెలుగు హక్కులనే పీపుల్స్ మీడియో ఫ్యాక్టరీ 175 కోట్ల రూపాయలతో డీల్ సెట్ చేసుకుందట. తెలుగులో ఇంత పెద్ద మొత్తంలో ఆదిపురుష్ హక్కులను సొంతం చేసుకోవడానికి ప్రభాస్ ఇమేజ్ నే కారణం అని చెప్పవచ్చు. ఇక తెలుగులో ఏరియాల వారిగా రైట్స్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వేరొకరికి ఇచ్చేసింది. గుంటూరు, నెల్లూరు మూవీ క్రియేషన్స్ రిలీజ్ చేయనుంది.

Adipurush Movie business in Telugu States

Adipurush Movie business in Telugu States

దీంతోపాటు గోదావరి జిల్లాల రైట్స్ డీల్ కూడా క్లోజ్ అయిపోయిందట. అలాగే నైజాం ఏరియా రిలీజ్ రైట్స్ 60 కోట్లకు మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇంకా వైజాగ్లో 25 నుంచి 30 కోట్ల మధ్య బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని అంచనా. ఇక తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మిగిలిన డీల్స్ కూడా పూర్తవుతాయని భావిస్తున్నారు. ఈవెంట్లో ఆదిపురుష్ నుంచి సెకండ్ ట్రైలర్ చేసే ఛాన్స్ ఉందని టాక్. మొత్తానికి తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బాగానే బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. మరీ ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp