Adipurush Movie : ఆదిపురుష్ కి వెళ్ళాలి అనుకుంటున్నారా ? ఈ న్యూస్ కంపల్సరీ చదవండి ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Adipurush Movie : ఆదిపురుష్ కి వెళ్ళాలి అనుకుంటున్నారా ? ఈ న్యూస్ కంపల్సరీ చదవండి !

Adipurush Movie  : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. రామాయణ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలతో పాటు విదేశీ […]

 Authored By aruna | The Telugu News | Updated on :14 June 2023,7:00 pm

Adipurush Movie  : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. రామాయణ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలతో పాటు విదేశీ భాషలలో కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. అయితే తాజాగా ఆదిపురుష్ సినిమా టికెట్ ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.

రోజుకు ఆరు షోలకు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం విడుదలైన మూడు రోజుల వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ పై 50 రూపాయలు పెంచేందుకు పర్మిషన్ ఇచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్లో టికెట్ల పెంపు పై ఎటువంటి క్లారిటీ లేదు. ఇక ఇప్పటికే ఆదిపురుష్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయ్యాయి. ఆదిపురుష్ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్ ఎక్కువగా వస్తాయని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని దేశమంతటా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Adipurush Movie ticket rates

Adipurush Movie ticket rates

అంతకుముందు విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రజలను బాగా ఆకర్షించాయి. ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడడంతో సెలబ్రిటీలు సైతం ఈ సినిమా టికెట్లను ఫ్రీగా డొనేట్ చేస్తున్నారు. సుమారుగా 500 కోట్ల బడ్జెట్ తో ఆదిపురుష్ సినిమా తెరకెక్కింది. కాగా నాన్ థియేట్రికల్ రైట్స్ దక్షిణాది రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు కలిపి ఇప్పటికే ఆదిపురుష్ సినిమా నిర్మాతలకు రూ.400కోట్లపైగా రికవరీ అయ్యాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా కలెక్షన్లు రూ.వెయ్యి కోట్లు దాటుతాయని అంచనాలు ఉన్నాయి. మరి ఏ సినిమా ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది