Adipurush Trailer : జై శ్రీరాం నినాదాలతో దద్దరిల్లిన థియేటర్ లు !

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 9 May 2023, 2:01 pm

Adipurush Trailer ; పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ త్వరలోనే ‘ ఆదిపురుష్ ‘ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆల్ ఇండియా మొత్తం ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇక ఆదిపురుష్ ట్రైలర్ ని ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 75 దేశాలలో డిజిటల్ మాధ్యమాలతో పాటు బిగ్ స్క్రీన్ పై రిలీజ్ చేయబోతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలో అయితే ఒక రోజు ముందుగానే ట్రైలర్ ని నేరుగా 100 కి పైగా స్క్రీన్ లలో ప్రదర్శించారు.

Adipurush Official Trailer Telugu Prabhas

Adipurush Official Trailer Telugu Prabhas

ఇది అరుదైన రికార్డ్ అని చెప్పాలి. ట్రైలర్ రిలీజ్ ద్వారా ఆదిపురుష్ సినిమాపై హైప్ క్రియేట్ చేయాలని సినిమా యూనిట్ గట్టిగా ఫిక్స్ అయింది. దానికి తగ్గట్టుగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. తాజాగా హైద్రాబాద్ లో ఏఎంబి మాల్ లో ఆదిపురుష్ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, దర్శకుడు ఓం రౌత్ పాల్గొన్నారు. దీంతో అభిమానులు భారీ ఎత్తున మాల్ కు చేరుకున్నారు. ప్రభాస్ ప్రభాస్ అంటూ థియేటర్ లోకి వెళ్లి ఆదిపురుష్ ట్రైలర్ ని వీక్షించారు. ట్రైలర్ ని చూసిన అభిమానులు ట్విట్టర్ లో జై శ్రీరామ్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

Adipurush Trailer Launch Event: Prabhas, Kriti Sanon's Magnum Opus Dubbed 'Breathtaking' By Fans, Check Reactions

అలాగే ట్రైలర్ లో స్క్రీన్ షాట్స్ తీస్తూ ట్విట్టర్ లో షేర్ చేస్తూ సూపర్ గా ఉందనికామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ ఓం రౌత్ అంచనాలకి మించి ట్రైలర్ ని అద్భుతంగా ఆవిష్కరించారు అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రభాస్ రాకతో ఏఏంబి మాల్ అభిమానులతో కిక్కిరిసింది. ఇక థియేటర్ అయితే జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగిపోయింది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ట్విట్టర్ లో ఆదిపురుష్ ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఈ ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటనున్నాడు.

https://youtu.be/OWdK7Gr96xc

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp