Adipurush : ఆదిపురుష్ వల్ల వణుకుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు సూపర్ గుడ్ న్యూస్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Adipurush : ఆదిపురుష్ వల్ల వణుకుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు సూపర్ గుడ్ న్యూస్

Adipurush : హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చూస్తున్నాడు ప్రభాస్. ఈ విషయంలో ఆయన అభిమానులు చాలా సంతోష పడుతున్నారు. ఎందుకంటే ఒకటి కాకపోతే ఇంకొకటి అని నమ్మకం వాళ్లలో కలుగుతుంది. ఏడాది తిరిగేటప్పటికి రెండు మూడు సినిమాలు విడుదల చేస్తే.. అందులో ఏదో ఒకటి కచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతుంది అనేది ప్రభాస్ ప్లాన్. ఆయన అభిమానులు కూడా ఇప్పుడు ఇదే అనుకుంటున్నారు. ఆదిపురుష్ సినిమాపై వస్తున్న నెగటివ్ ట్రోలింగ్ గురించి మర్చిపోవడా […]

 Authored By sandeep | The Telugu News | Updated on :11 October 2022,1:00 pm

Adipurush : హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చూస్తున్నాడు ప్రభాస్. ఈ విషయంలో ఆయన అభిమానులు చాలా సంతోష పడుతున్నారు. ఎందుకంటే ఒకటి కాకపోతే ఇంకొకటి అని నమ్మకం వాళ్లలో కలుగుతుంది. ఏడాది తిరిగేటప్పటికి రెండు మూడు సినిమాలు విడుదల చేస్తే.. అందులో ఏదో ఒకటి కచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతుంది అనేది ప్రభాస్ ప్లాన్. ఆయన అభిమానులు కూడా ఇప్పుడు ఇదే అనుకుంటున్నారు. ఆదిపురుష్ సినిమాపై వస్తున్న నెగటివ్ ట్రోలింగ్ గురించి మర్చిపోవడా నికి ఆయన తర్వాత సినిమాల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వాళ్లకు ఒక అదిరిపోయే సూపర్ గుడ్ న్యూస్ దొరికింది. ఆదిపురుష్ సినిమాపై ఈరోజు ఇంత నెగిటివ్ ట్రోలింగ్ జరగడానికి ప్రధానమైన కారణం అప్డేట్స్ ఇవ్వకుండా దాచిపెట్టడం.

సినిమా మొదలుపెట్టిన రోజు నుంచి టీజర్ విడుదలయ్యే వరకు ఒక్కటంటే ఒక్క పోస్టర్ కూడా విడుదల చేయలేదు దర్శకుడు ఓం రౌత్. దాంతో వైపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఆకాశంలో ఉంటే.. వచ్చిన పోస్టర్ పాతాళంలో ఉంది. ఇక టీజర్ గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఆదిపురుష్ ఈ రోజు ఇంత దారుణంగా ట్రోల్ అవుతుంది. ఈ తప్పు మీరు చేయొద్దు అంటూ ప్రభాస్ నెక్స్ట్ డైరెక్టర్స్ ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లకు చెప్తున్నారు అభిమానులు. మీ సినిమా ఎలా ఉండబోతుందో మాకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి.. దాన్ని బట్టి మేము అంచనాలు పెట్టుకుంటాం అంటున్నారు వాళ్ళు. ఈ జాబితాలో ప్రశాంత్ నీల్ కాస్త కూర్చో ముందున్నాడు కానీ నాగ్ అశ్విన్ మాత్రం ఇప్పటి వరకు చిన్న హింట్ కూడా ఇవ్వలేదు.కే జి ఎఫ్ తర్వాత ప్రశాంత్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో సలార్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

Adipurush Super good news for Prabhas fans

Adipurush Super good news for Prabhas fans

Adipurush : అటు సలార్.. ఇటు ప్రాజెక్ట్ కే..

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 70% పూర్తయింది. ఇది ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ కూడా ఉంది ఎందుకంటే షూటింగ్ లోకేషన్ నుంచి ఇప్పటికే కొన్ని వీడియోలు లీక్ అయ్యాయి. అలాగే ప్రభాస్ పోస్టర్స్ కూడా బయటికి వచ్చాయి. వీటిని చూసిన తర్వాత సినిమా ఎంత మాస్ లెవెల్ లో ఉంటుందో అభిమానులు ఊహించుకోవచ్చు. పైగా ప్రశాంత్ నీల్ కూడా పెద్దగా ప్రయోగాలు చేసే రకం కాదు. కచ్చితంగా పోస్టర్స్, టీజర్స్ లో ఏం కనిపిస్తుందో సినిమాలో కూడా అలాగే ఉంటుంది. అందుకే ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా కంటే కూడా సలార్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ సినిమా 2023 సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో జనవరి 12న రాబోయే ఆదిపురుష్ అసలు లేదు. ఈ సినిమా సౌత్ ప్రేక్షకులకు ఎక్కడం కష్టమని ఇక్కడ ఫ్యాన్స్ ముందుగానే ఫిక్స్ అయిపోయారు. నార్త్ లో ఎంత బాగా ఆడినా కూడా తమ ఆశ తీర్చే సినిమా మాత్రం కచ్చితంగా సలార్ అవుతుందని వాళ్లు నమ్ముతున్నారు. మరి వాళ్ళ నమ్మకం ప్రశాంత్ నీల్ ఎంతవరకు నిలబెడతాడో చూడాలి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది