Adipurush Movie : మనోళ్ళకి ఆదిపురుష్ ఎందుకు ఎక్కలేదు అంటే .. కారణం ఇదే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Adipurush Movie : మనోళ్ళకి ఆదిపురుష్ ఎందుకు ఎక్కలేదు అంటే .. కారణం ఇదే !

Adipurush Movie : పాన్ ఇండియా హీరో ప్రభాస్ ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. సినిమా టాక్ ఎలా ఉన్నా వసూళ్ల పరంగా తగ్గేదేలే అంటూ దూసుకెళుతుది. మొదటిరోజు ఏకంగా 140 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఆ తర్వాత నుంచి కలెక్షన్స్ తగ్గుకుంటూ వస్తున్నాయని సమాచారం. అంతేకాకుండా చాలామంది ప్రముఖులు ఈ సినిమా టికెట్లను […]

 Authored By aruna | The Telugu News | Updated on :20 June 2023,10:00 am

Adipurush Movie : పాన్ ఇండియా హీరో ప్రభాస్ ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. సినిమా టాక్ ఎలా ఉన్నా వసూళ్ల పరంగా తగ్గేదేలే అంటూ దూసుకెళుతుది. మొదటిరోజు ఏకంగా 140 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఆ తర్వాత నుంచి కలెక్షన్స్ తగ్గుకుంటూ వస్తున్నాయని సమాచారం. అంతేకాకుండా చాలామంది ప్రముఖులు ఈ సినిమా టికెట్లను డొనేట్ చేసి సినిమాకి హైప్ క్రియేట్ చేశారు. ఇక సినిమా రిలీజ్ అయిన ప్రతి థియేటర్లో హనుమంతుడు వచ్చి సినిమా చూస్తాడని

ఒక సీటు వదిలడం ఇవన్నీ చెప్పడంతో సినిమాకి హైట్ క్రియేట్ అయింది. అయితే సినిమా విడుదలయ్యాక సినిమాపై విమర్శలు వచ్చాయి. రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కిన సినిమాని మనవాళ్లు చూస్తారు. కానీ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మాత్రం విమర్శలకు గురవుతుంది. ఈ సినిమాలోని పాత్రల ఆహార్యం గ్రాఫిక్స్ డైలాగుల విషయంలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా హనుమంతుడు డైలాగుల విషయంలో ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇక తెలుగులో ఎన్నో రామాయణం సినిమాలు వచ్చాయి. వాటన్నింటినీ మనోళ్లు ఆదరించారు.

Adipurush Movie

Adipurush Movie

రాముడు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఎన్టీఆర్. రాముడికి మీసాలు ఉండవు అని ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి మీసాలు ఉండడం రావణుడినీ డిఫరెంట్ గా చూపించడంతో సినిమాపై ట్రోల్స్ వస్తున్నాయి. మన తెలుగులో వచ్చిన రామాయణ సినిమాలన్నింటిని మనోళ్లు ఆదరించారు. ఇవన్నీ టెక్నాలజీ లేని సమయంలో వచ్చి ప్రేక్షకకులు మెప్పించాయి. అలాంటి క్లాసిక్ సినిమాలను చూసిన ప్రేక్షకులకు టెక్నాలజీతో వచ్చిన ఆదిపురుష్ సినిమా పై కోపం రావడంలో ఆశ్చర్యం లేదు. అందుకే మన వాళ్లకు ఆదిపురుష్ సినిమా నచ్చలేదని తెలుస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది