prabhas : మా ప్రభాస్ జీవితం నాశనం చేసావు కదరా .. ఓం రౌత్ మీద ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ !
prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై మరోసారి విమర్శల వర్షం కురుస్తోన్న సంగతి తెలిసిందే. `ఆదిపురుష్` సినిమా రిజల్ట్ తో ప్రశ్నించే వేళ్లు అన్ని డార్లింగ్ వైపే చూపిస్తున్నాయి. ఇలాంటి కథలు ఎందుకు చేస్తున్నాడు? ఇలాంటి సినిమాలు చేయాలి అన్న ఐడియా ఎవరిది ఎవరి మాటా విని ఇతిహాసాల జోలికి వెళ్తున్నాడు. ప్రభాస్ కు స్టోరీలు ఎంపిక చేసుకోవడం ఎందుకు రావడం లేదు అంటూ సోషల్ మీడియా త్రోల్ చేస్తున్నారు. వరుసగా మూడవ సారి పాన్ ఇండియా మార్కెట్ లో ఫెయిల్ అవ్వడం ప్రభాస్ అభిమానులు సైతం విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ క్రమంలో రివ్యూరైటర్లపై సైతం ఊహించని దాడులు జరుగుతున్నాయి. మరి వీటికి ప్రభాస్ కారణమా లేక డైరెక్టర్ లు కారణమా. స్టోరీల ఎంపిక పరంగా డార్లింగ్ కి తిరుగులేదు. పాన్ ఇండియా కి కనెక్ట్ అయ్యే కథల్ని ఎంచుకోవ డంలో నూరుశాతం సక్సెస్ సాధిస్తున్నారు. ఇలాంవిటి ఎంపిక చేయాలన్నా హీరోకి చాలా పరిజ్ఞానం అవసరం. అవన్నీ డార్లింగ్ లో లెక్కకు మించి ఉన్నాయి. `బాహుబలి` తర్వాత `సాహో`లాంటి యాక్షన్ సినిమా `రాధేశ్యామ్` లాంటి బ్యూటీఫుల్ వింటేజ్ లవ్ స్టోరీ అటుపై రామాయణం ఆధారంగా` ఆదిపురుష్` అన్ని గొప్ప కథా బలం ఉన్న సినిమాలే. స్టోరీల పరంగా డార్లింగ్ ఫుల్ క్లారిటీతోనే ఉన్నారు.
కానీ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడంలోనే వైఫల్యాలు ఎదురయ్యాయి. దీనికి బాధ్యులు ఎవరు అంటే దర్శకులనే చెప్పాలి. హీరో కేవలం స్టోరీ మాత్రమే విని ఒకే చేస్తాడు. ఆ తర్వాత బాధ్యత అంతా మేకర్స్ దే. సినిమా ఎలా తీస్తే జనాలకి ఎక్కుతుంది ఎలా మార్కెట్ అవుతుంది అని వాళ్లు కరెక్ట్ గా ప్లాన్ చేయాలి. రిలీజ్ తర్వాత విమర్శలకు ఎలాంటి తావు ఇవ్వకూడదు స్టోరీ ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సవాలక్ష విషయాలు దృష్టిలో పెట్టుకునే ఏ దర్శకుడైనా సినిమా చేస్తాడు. డైరెక్టర్స్ కారణంగానే ప్రభాస్ ఫెయిల్ అవుతున్నాడు అని అభిమానులు అంటున్నారు.