
Adipurush Super good news for Prabhas fans
Adipurush : హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చూస్తున్నాడు ప్రభాస్. ఈ విషయంలో ఆయన అభిమానులు చాలా సంతోష పడుతున్నారు. ఎందుకంటే ఒకటి కాకపోతే ఇంకొకటి అని నమ్మకం వాళ్లలో కలుగుతుంది. ఏడాది తిరిగేటప్పటికి రెండు మూడు సినిమాలు విడుదల చేస్తే.. అందులో ఏదో ఒకటి కచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతుంది అనేది ప్రభాస్ ప్లాన్. ఆయన అభిమానులు కూడా ఇప్పుడు ఇదే అనుకుంటున్నారు. ఆదిపురుష్ సినిమాపై వస్తున్న నెగటివ్ ట్రోలింగ్ గురించి మర్చిపోవడా నికి ఆయన తర్వాత సినిమాల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వాళ్లకు ఒక అదిరిపోయే సూపర్ గుడ్ న్యూస్ దొరికింది. ఆదిపురుష్ సినిమాపై ఈరోజు ఇంత నెగిటివ్ ట్రోలింగ్ జరగడానికి ప్రధానమైన కారణం అప్డేట్స్ ఇవ్వకుండా దాచిపెట్టడం.
సినిమా మొదలుపెట్టిన రోజు నుంచి టీజర్ విడుదలయ్యే వరకు ఒక్కటంటే ఒక్క పోస్టర్ కూడా విడుదల చేయలేదు దర్శకుడు ఓం రౌత్. దాంతో వైపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఆకాశంలో ఉంటే.. వచ్చిన పోస్టర్ పాతాళంలో ఉంది. ఇక టీజర్ గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఆదిపురుష్ ఈ రోజు ఇంత దారుణంగా ట్రోల్ అవుతుంది. ఈ తప్పు మీరు చేయొద్దు అంటూ ప్రభాస్ నెక్స్ట్ డైరెక్టర్స్ ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లకు చెప్తున్నారు అభిమానులు. మీ సినిమా ఎలా ఉండబోతుందో మాకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి.. దాన్ని బట్టి మేము అంచనాలు పెట్టుకుంటాం అంటున్నారు వాళ్ళు. ఈ జాబితాలో ప్రశాంత్ నీల్ కాస్త కూర్చో ముందున్నాడు కానీ నాగ్ అశ్విన్ మాత్రం ఇప్పటి వరకు చిన్న హింట్ కూడా ఇవ్వలేదు.కే జి ఎఫ్ తర్వాత ప్రశాంత్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో సలార్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
Adipurush Super good news for Prabhas fans
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 70% పూర్తయింది. ఇది ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ కూడా ఉంది ఎందుకంటే షూటింగ్ లోకేషన్ నుంచి ఇప్పటికే కొన్ని వీడియోలు లీక్ అయ్యాయి. అలాగే ప్రభాస్ పోస్టర్స్ కూడా బయటికి వచ్చాయి. వీటిని చూసిన తర్వాత సినిమా ఎంత మాస్ లెవెల్ లో ఉంటుందో అభిమానులు ఊహించుకోవచ్చు. పైగా ప్రశాంత్ నీల్ కూడా పెద్దగా ప్రయోగాలు చేసే రకం కాదు. కచ్చితంగా పోస్టర్స్, టీజర్స్ లో ఏం కనిపిస్తుందో సినిమాలో కూడా అలాగే ఉంటుంది. అందుకే ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా కంటే కూడా సలార్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ సినిమా 2023 సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో జనవరి 12న రాబోయే ఆదిపురుష్ అసలు లేదు. ఈ సినిమా సౌత్ ప్రేక్షకులకు ఎక్కడం కష్టమని ఇక్కడ ఫ్యాన్స్ ముందుగానే ఫిక్స్ అయిపోయారు. నార్త్ లో ఎంత బాగా ఆడినా కూడా తమ ఆశ తీర్చే సినిమా మాత్రం కచ్చితంగా సలార్ అవుతుందని వాళ్లు నమ్ముతున్నారు. మరి వాళ్ళ నమ్మకం ప్రశాంత్ నీల్ ఎంతవరకు నిలబెడతాడో చూడాలి.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.