Adire Abhi : అదిరే అభికి అక్కడ నచ్చడం లేదట.. ఇంకెక్కడికి వెళ్తావ్‌?

 Authored By prabhas | The Telugu News | Updated on :3 May 2022,9:00 pm

Adire Abhi : ఈటీవీ లోని జబర్దస్త్‌ లో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన అదిరే అభి ఎంతో మంది కమెడియన్స్ ను పట్టుకు వచ్చాడు. ఎక్కడో ఉన్న వారిని గుర్తించి వారితో మాట్లాడి వారిని జబర్దస్త్‌ స్టేజీ పైకి తీసుకు వచ్చిన ఘనత అదిరే అభికి ఉంటుంది అనడం లో సందేహం లేదు. యూట్యూబ్‌ లో ఆది యొక్క చిన్న వీడియోను చూసి అదిరే అభి ఛాన్స్ ఇచ్చాడు. జబర్దస్త్ లో చిన్న అవకాశం ఇచ్చాడు. ఇప్పటికి ఎప్పటికి హైపర్ ఆదికి అదిరే అభి ఒక దేవుడు అనే విషయం తెల్సిందే. ఆ అభిమానంను ఎప్పుడు కూడా హైపర్‌ ఆది చూపిస్తూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల అదిరే అభి ఇటీవల ఈటీవీని వీడి మల్లెమాల చెంతకు చేరడం జరిగింది.

కొత్త కామెడీ స్టార్స్ లో అదిరే అభి సందడి చేస్తున్నాడు. ఎలాగైతే జబర్దస్త్ షో లో తన కామెడీ తో ఆకట్టుకునే వాడో అలాగే అదిరే అభి కామెడీ స్టార్స్ లో కూడా కామెడీ చేస్తూ మెప్పిస్తూ వచ్చాడు. జబర్దస్త్‌ మల్లెమాల టీమ్‌ వారితో విభేదాల కారణంగా స్టార్‌ మా కు వెళ్లి పోయిన అదిరే అభికి అక్కడ కూడా ఇబ్బందులు తప్పడం లేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్కడి వారితో అభికి పదే పదే చిరాకులు తలెత్తుతున్నాయట. షూటింగ్‌ విషయం మొదలుకుని ప్రతి ఒక్క విషయంలో కూడా అదిరే అభిని వారు ఇబ్బంది పెడుతున్నారనే పుకార్లు గుప్పుమంటున్నాయి.

Adire Abhi not happy with comedy stars and star maa

Adire Abhi not happy with comedy stars and star maa

వారు పదే పదే తనను టార్గెట్ చేస్తున్న కారణంగా కామెడీ స్టార్స్ నుండి కూడా వెళ్లి పోవాలని నిర్ణయించుకున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. మరో వైపు హైపర్ ఆది జబర్దస్త్ ను వీడి కామెడీ స్టార్స్ కు వస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆది రావడం వల్లే అదిరే అభిని స్టార్‌ మా వారు పొమ్మనలేక పొగబెడుతున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం అదిరే అభి గురించిన చర్చ జరుగుతోంది. త్వరలోనే కామెడీ స్టార్స్ లో ఏదైనా పెద్ద మార్పు జరగడం అనేది కన్ఫర్మ్‌ గా కనిపిస్తుంది. త్వరలోనే హైపర్ ఆది కామెడీ స్టార్స్ లో రావాలని మా ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి