Hyper Aadi : పాపం హైపర్ ఆది గురువు… ఎలా ఉండే వాడు ఎలా అయ్యాడు
Hyper Aadi : ప్రస్తుతం ఈటీవీలో హైపర్ ఆది క్రేజ్ ఏంటో.. ఆయన స్థాయి ఏంటో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు పలు కార్యక్రమాలు పూర్తిగా ఆయనపై ఆధారపడి నడుస్తున్నాయి. రికార్డ్ స్థాయి రెమ్యూనరేషన్ హైపర్ ఆది ఈటీవీ మల్లెమాల నుండి తీసుకుంటున్నాడు. జబర్దస్త్ కార్యక్రమంలో అదిరే అభి టీం ద్వారా హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి ఎపిసోడ్ ను ఆది ఎడిటింగ్ లో లేచి పోయింది. దాంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అదిరే అభి ప్రోత్సాహంతో స్క్రిప్ట్ రాయడం కూడా ఆది మొదలు పెట్టాడు అప్పటి నుండి మెల్ల మెల్లగా ఆది కి గుర్తింపు రావడం మొదలైంది. అదిరే అభి టీం లో కీలక సభ్యుడిగా ఆది నిలిచాడు.
అప్పటి నుండి ఆది గురించి జనాలు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అతడి కామెడీ టైమింగ్ పంచ్ డైలాగ్స్ అతని స్టార్ గా నిలబెట్టాయి అనడంలో సందేహం లేదు. గురువు అదిరే అభి ని మించి గుర్తింపు దక్కించుకున్నాడు. గురువు టీం నుండి బయటకు వచ్చి సొంతంగా హైపర్ ఆది రైజింగ్ రాజు టీం ఏర్పాటు చేయడం జరిగింది. హైపర్ ఆదికి ఈ స్థాయిలో గుర్తింపు పొందినది అది నూటికి నూరు శాతం అదిరే అభి క్రెడిట్ అనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆ అదిరే అభి ఎక్కడ ఉన్నాడు అంటే సమాధానం లేదు. ప్రస్తుతం దారుణమైన పరిస్థితిలో ఉన్నాడంటూ జబర్దస్త్ మాజీ కంటెస్టెంట్స్ మాట్లాడుకుంటున్నారు. జబర్దస్త్ నుండి వెళ్లి పోయిన తర్వాత స్టార్ మా లో ప్రసారమైన కామెడీ స్టార్స్ లో టీం లీడర్ గా అదిరే అభి వ్యవహరించిన విషయం తెలిసిందే. కానీ కొన్నాళ్లకే ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం కామెడీ షోస్ ఏవి కూడా ఆయన చేయడం లేదంటూ వార్తలు వస్తున్నాయి.

How did he become what he used to be a Hyper Aadi guru
ఇప్పటి వరకు అదిరే అభి కొత్త కార్యక్రమాలకు సైన్ చేయలేదని.. దాంతో మళ్లీ ఉద్యోగం చేసుకునేందుకు అదిరే అభి రెడీ అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అదిరే అభి మంచి ప్రతిభ ఉన్న కమెడియన్స్ ఆయన ఎంతో మందిలోని టాలెంట్ ని గుర్తించి ప్రోత్సహించాడు. హైపర్ ఆది మాత్రమే కాకుండా గతంలో ఆయన ప్రోత్సాహంతో కమెడియన్స్ గా నిలిచిన వారు చాలా మంది ఉన్నారు. అయినా కూడా ఇప్పుడు హైపర్ ఆది ఇతర కమెడియన్స్ బిజీ బిజీగా ఉండగా.. అదిరే అభి మాత్రం అవకాశాల కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదిరే అభి మళ్ళీ జబర్దస్త్ కి రావాలని కొందరు కోరుకుంటుంటే.. మరికొందరు మాత్రం ఆహాలో ప్రసారం కాబోతున్న కామెడీ స్టాక్ ఎక్సేంజ్ లో ఆయన ఉండాలని ఆశిస్తున్నారు. జబర్దస్త్ నుండి బయటికి వెళ్లి పోయిన వాళ్లలో చాలా మంది ఇలా కొన్నాళ్లు సందడి చేసి ఆ తర్వాత కనిపించకుండా పోతున్నారు. అదిరే అభి పరిస్థితి కూడా అదేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.