Aditya Music : ఆచార్య ఆడియో రైట్స్.. కళ్లు చెదిరే రేటుకు కొన్న ఆదిత్య కంపెనీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Aditya Music : ఆచార్య ఆడియో రైట్స్.. కళ్లు చెదిరే రేటుకు కొన్న ఆదిత్య కంపెనీ

Aditya Music : మెగాస్టార్ చిరంజీవి మణిశర్మ కాంబోకు టాలీవుడ్‌లో ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి కాంబోలో ఎన్నో మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. అందులో ఇండస్ట్రీ హిట్‌లు, బ్లాక్ బస్టర్, సూపర్ హిట్లున్నాయి. దాదాపు పదిహేను చిత్రాలు ఈ కాంబోలో వచ్చి ఉంటాయి. అన్నీ కూడా మ్యూజిక్ పరంగా సూపర్ హిట్ అయ్యాయి. చూడాలని వుంది అనే సినిమాతో మొదలైన ఈ ప్రయాణం స్టాలిన్ వరకు కొనసాగింది. ఎన్నెన్నో మెలోడీలు, ఎప్పటికీ నిలిచిపోయే […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :3 February 2021,5:15 pm

Aditya Music : మెగాస్టార్ చిరంజీవి మణిశర్మ కాంబోకు టాలీవుడ్‌లో ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి కాంబోలో ఎన్నో మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. అందులో ఇండస్ట్రీ హిట్‌లు, బ్లాక్ బస్టర్, సూపర్ హిట్లున్నాయి. దాదాపు పదిహేను చిత్రాలు ఈ కాంబోలో వచ్చి ఉంటాయి. అన్నీ కూడా మ్యూజిక్ పరంగా సూపర్ హిట్ అయ్యాయి. చూడాలని వుంది అనే సినిమాతో మొదలైన ఈ ప్రయాణం స్టాలిన్ వరకు కొనసాగింది.

Aditya Music bought Acharya Audio rights

Aditya Music bought Acharya Audio rights

ఎన్నెన్నో మెలోడీలు, ఎప్పటికీ నిలిచిపోయే ఐటెం నంబర్స్ ఈ కాంబోలో వచ్చాయి. మళ్లీ ఇన్నేళ్లకు మణిశర్మ చిరు కాంబో సెట్ అయింది. అది కూడా మ్యూజిక్ టేస్ట్ ఉన్న కొరటాల శివ వంటి దర్శకుడంటే పాటలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అందుకే ఇలా అన్ని కలిసి రావడంతో ఆచార్య ఆడియోపై ఎన్నో అంచనాలున్నాయి. వాటికి తగ్గట్టే ఆచార్య ఆడియోను భారీ మొత్తంలో ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.

కళ్లు చెదిరే రేటుకు కొన్న ఆదిత్య కంపెనీ Aditya Music

ఆచార్య పాటలు ఇంకా విడుదల కూడా కాలేదు. కానీ ఇప్పటికే ఆ మేరకు బిజినెస్ కూడా పూర్తయిందట. ఆచార్య ఆడియో హక్కులను దాదాపు నాలుగు కోట్లు పెట్టి ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికి ఇదే హయ్యస్ట్ బిజినెస్ అని తెలుస్తోంది. మొత్తానికి ఆచార్య విడుదలకు ముందే ఇలా ఎన్నో రికార్డులను కొల్లగొట్టేలా కనిపిస్తోంది. అయితే ఆచార్య సినిమాను వేసవి కానుకగా మే 13న విడుదల చేయబోతోన్నారు.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది