Anasuya : జబర్దస్త్‌.. అనసూయ వెళ్లి పోయినా దూకుడు ఆగలేదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anasuya : జబర్దస్త్‌.. అనసూయ వెళ్లి పోయినా దూకుడు ఆగలేదు

Anasuya : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు జబర్దస్త్‌ అనేది పెనవేసుకు పోతుంది. ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్‌ కార్యక్రమం నెం.1 షో గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతూనే ఉంది. స్టార్ మా తో పాటు జీ తెలుగు లో ఎన్ని కార్యక్రమాలను తీసుకు వచ్చినా కూడా జబర్దస్త్ కి ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో జబర్దస్త్‌ గురించి ఎలాంటి ప్రచారం జరిగినా.. ఎలాంటి వివాదాలు నడుస్తున్నా కూడా అస్సలు ప్రేక్షకులు పట్టించుకోకుండా […]

 Authored By aruna | The Telugu News | Updated on :19 August 2022,9:40 pm

Anasuya : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు జబర్దస్త్‌ అనేది పెనవేసుకు పోతుంది. ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్‌ కార్యక్రమం నెం.1 షో గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతూనే ఉంది. స్టార్ మా తో పాటు జీ తెలుగు లో ఎన్ని కార్యక్రమాలను తీసుకు వచ్చినా కూడా జబర్దస్త్ కి ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో జబర్దస్త్‌ గురించి ఎలాంటి ప్రచారం జరిగినా.. ఎలాంటి వివాదాలు నడుస్తున్నా కూడా అస్సలు ప్రేక్షకులు పట్టించుకోకుండా షో ను చూసేందుకు మొగ్గు చూపుతూ షో ను టాప్ లోనే ఉంచుతూ వచ్చారు.

ఇప్పుడు జబర్దస్త్‌ నుండి ఎంతో మంది వెళ్లి పోయారు. తాజాగా యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్‌ కి గుడ్ బై చెప్పింది. ఆ ప్లేస్ లో రష్మి గౌతమ్ వస్తోంది. అయినా కూడా ఏమాత్రం రేటింగ్ తగ్గలేదు. జబర్దస్త్‌ రేటింగ్ విషయం లో ఎలాంటి అనుమానం లేకుండా టాప్ లో ఉంది. గతంలో మాదిరిగా పదుల సంఖ్యలో రేటింగ్‌ రావడం లేదు కాని ఇప్పుడు కూడా టాప్ లోనే రేటింగ్ ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. అనసూయ వెళ్లి పోయినా కొత్త టీమ్‌ లీడర్లు వచ్చినా కూడా పెద్ద గా మార్పు లేకుండానే రేటింగ్ నమోదు అవుతోంది.

after anasuya out of from jabardasth the show rating

after anasuya out of from jabardasth the show rating

స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ కార్యక్రమం మాత్రం నిరాశ పర్చుతూనే ఉంది. జబర్దస్త్‌ కమెడియన్స్ అంతా కూడా ఆ షో కు వెళ్లినా జనాలు మాత్రం ఇంకా జబర్దస్త్‌ ను మాత్రమే చూడాలని భావిస్తున్నారు. అందుకోసం జబర్దస్త్‌ నిర్వాహకులు కూడా చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఉన్నట్లుగా కమెడియన్స్ లేకున్నా కూడా కామెడీ విషయంలో రాజీ పడకుండా అభిమానులను అలరించే విధంగా కమెడియన్స్‌ మరియు షో నిర్వాహకులు కామెడీ స్కిట్స్ ను తీసుకు వస్తున్నారు. జబర్దస్త్‌ దూకుడు అనసూయ కాదు మరెవ్వరు పోయినా ఆగేది లేదని మరో సారి నిరూపితం అయ్యింది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది