Bigg Boss Telugu 7 : నీ కాళ్లు పట్టుకుంటా అని రతికను బతిమిలాడిన శివాజీ.. నామినేషన్స్‌లో మళ్లీ ప్రిన్స్ యావర్ టార్గెట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss Telugu 7 : నీ కాళ్లు పట్టుకుంటా అని రతికను బతిమిలాడిన శివాజీ.. నామినేషన్స్‌లో మళ్లీ ప్రిన్స్ యావర్ టార్గెట్

Bigg Boss Telugu 7 : ఈవారం నామినేషన్లు కూడా బిగ్ బాస్ హౌస్ లో వాడీ వేడీగా జరగబోతున్నాయి. ఎందుకంటే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మూడు వారాల్లో ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. నామినేషన్లలో ఏమాత్రం తేడా కొట్టినా ఈ వారం కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారో అని టెన్షన్ ఇంటి సభ్యులు, కంటెస్టెంట్లలో ఉంది. అందుకే కంటెస్టెంట్లు ఈ వారం నామినేషన్లను కూడా చాలెంజింగ్ గా తీసుకున్నారు. బిగ్ బాస్ అప్పుడే నాలుగో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :25 September 2023,3:00 pm

Bigg Boss Telugu 7 : ఈవారం నామినేషన్లు కూడా బిగ్ బాస్ హౌస్ లో వాడీ వేడీగా జరగబోతున్నాయి. ఎందుకంటే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మూడు వారాల్లో ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. నామినేషన్లలో ఏమాత్రం తేడా కొట్టినా ఈ వారం కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారో అని టెన్షన్ ఇంటి సభ్యులు, కంటెస్టెంట్లలో ఉంది. అందుకే కంటెస్టెంట్లు ఈ వారం నామినేషన్లను కూడా చాలెంజింగ్ గా తీసుకున్నారు. బిగ్ బాస్ అప్పుడే నాలుగో వారానికి వచ్చింది. నామినేషన్ల గురించి పక్కన పెడితే.. ఇంట్లో శివాజీ, రతిక మధ్య ఒక చిన్న డిస్కషన్ నడిచింది. నాగార్జున ముందు ప్రశాంత్, రతిక ఇద్దరి రిలేషన్ షిప్ గురించి రెండు చేతులు ఒకేసారి కలిశాయి సార్ అందుకే ఇద్దరి గురించి అందరికీ తెలిసింది. ఎవరి వెంట ఎవరు పడటం లేదు.. ఇద్దరూ అలాగే ఉన్నారు అన్నట్టుగా శివాజీ మాట్లాడటంతో ఆ విషయం రతికకు నచ్చలేదు.

again prince yawar triggered in fourth week nominations in bigg boss telugu 7

#image_title

తాజాగా ఈ విషయంపై శివాజీతో డిస్కషన్ పెట్టింది. ఆ మాట ఎందుకు అన్నావు అన్నా అంటే.. నేను అనకపోయినా వీడియో వేసి చూపిస్తారు కదా అప్పుడు ఏంటి మీ పరిస్థితి. సరదాగా ఉన్నదే కదా నేను అన్నది అంటాడు శివాజీ. దీంతో వీడియోలు వేస్తే వేయనీయ్ అన్నా. నాకు హ్యాపీ. ఒక అమ్మాయిగా నాకు అలా అనిపిస్తోంది అంటుంది రతిక. నువ్వు నాకు క్లాస్ పీకుతున్నావు అంతే కదా. నువ్వు హర్ట్ అయ్యావనే కదా సారీ చెప్పింది. ఇంకా ఏం చేయాలి చెప్పు.. కాళ్లు పట్టుకోవాల్నా చెప్పు అంటాడు శివాజీ. దీంతో అది కాదు అన్న అంటుంది రతిక. మరి ఎందుకు సాగదీస్తున్నావు. వాంటెడ్ గా అనిపిస్తోంది ఇదంతా అంటాడు శివాజీ.

Bigg Boss Telugu 7 : తేజ, ప్రియాంకను నామినేట్ చేసిన ప్రిన్స్ యావర్

ఇక.. నాలుగో వారం నామినేషన్లలో భాగంగా ప్రిన్స్ యావర్.. తేజ, ప్రియాంకను నామినేట్ చేశాడు. అయితే.. ఈసారి ఏ కంటెస్టెంట్ అయినా నామినేట్ చేస్తే.. నామినేషన్స్ కి సరైన రీజన్స్ చెప్పాలి. అందులోనూ ఇంటి సభ్యులు ముగ్గురు శోభా శెట్టి, శివాజీ, సందీప్ ఈ ముగ్గురు జడ్జీలుగా ఉంటారు. వాళ్లు ఓకే అంటేనే ఆ నామినేషన్స్ వేసినట్టు. ప్రిన్స్ యావర్ తాను ఎందుకు ప్రియాంక, తేజ ఇద్దరికీ నామినేషన్స్ వేస్తున్నాడో చెబుతాడు కానీ.. దాన్ని వాళ్లు తీసుకోరు. అసలు ఇవి రీజన్సే కాదు. నువ్వే బిగ్ బాస్ ప్రాపర్టీస్ పగుల గొట్టావు అంటూ ప్రియాంక.. యావర్ మీదికి రివర్స్ అవుతుంది. శోభ కూడా యావర్ రీజన్స్ ను ఒప్పుకోదు. తేజ కూడా యావర్ రీజన్స్ తో ఒప్పుకోడు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ ప్రసారం అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది