Sudigali Sudheer : సుడిగాలి సుధీర్, మల్లెమాల మద్య ఏం జరుగుతోంది? పండక్కి కూడా పక్కకు పెట్టారేం?
Sudigali Sudheer : ఈటీవీ గట్టెక్కుతున్నది మల్లెమాల వారి షో ల వల్ల అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈటీవీలో జబర్దస్త్.. ఢీ.. క్యాష్.. శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రమే కాకుండా పండుగలకు ప్రత్యేక షో లను కూడా మల్లెమాల టీవీ వారు ఈటీవీ కోసం షో లను నిర్వహిస్తున్నారు. ఈమద్య కాలంలో మల్లెమాల షో లు లేదా కార్యక్రమాలు అనగానే అందరికి గుర్తుకు వచ్చే పేరు హైపర్ ఆది. ఒక్క హైపర్ ఆదికే ప్రతి నెల మల్లెమాల వారు పాతిక ముప్పై లక్షల రూపాయల చెక్కును ఇస్తూ ఉంటుందని ఒక టాక్ ఉంది. అంతకు ముందు సుధీర్ కు అత్యధికంగా మల్లెమాల వారు చెక్ ఇచ్చే వారు.
సుధీర్ ను ఈమద్య కాలంలో మల్లెమాల వారు పక్కకు పెడుతున్నారా అంటే ఔను అనే సమాదానం వినిపిస్తుంది. మల్లెమాల వారు చేస్తున్న షో ల్లో సుధీర్ ను పక్కకు పెడుతున్నారు. జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రమే ప్రస్తుతం సుధీర్ కనిపిస్తున్నాడు. ఢీ ని ఎంతో సక్సెస్ చేసిన సుధీర్ ను తొలగించారు. ఢీ కొత్త సీజన్ లో సుధీర్ లేడు. ఎవరో బజన బ్యాచ్ ను దించారు. వారు కనీసం ఎంటర్ టైన్ చేయలేక పోతున్నారు. ఢీ అంటే ఎంటర్ టైన్మెంట్ కోసమే చాలా మంది సుధీర్ ఉన్నప్పుడు చూసేవారు. ఇప్పుడు సుధీర్ లేడు కనుక డాన్స్ లేదు ఎంటర్ టైన్మెంట్ లేదు ఎందుకు ఢీ ని చూడటం అనుకుంటున్నారు.

again sudigali sudheer out from mallemala show
Sudigali Sudheer : ఢీ నుండి తప్పించారు.. సుడిగాలి సుధీర్ ను మళ్లీ తప్పిస్తూనే ఉన్నారు
ఢీ ఎంత పాపులర్ అయినా కూడా సుధీర్ ఉంటేనే చూస్తాం అన్నట్లుగా ప్రేక్షకులు మారారు. ఇప్పుడు సంక్రాంతి పండుగ ఈవెంట్ లో కూడా సుదీర్ కనిపించడం లేదు. ప్రతి సారి పండుగ ఈవెంట్ లో సుధీర్ హైలైట్ అవుతూ వస్తుంటాడు. కాని ఈసారి మాత్రం సుధీర్ కనీసం కనిపించడం లేదు. సుధీర్ ఈసారి కూడా లేక పోవడంతో మల్లెమాల వారికి సుధీర్ కు మద్య ఏదో జరుగుతుంది. అందుకే ఢీ నుండి తప్పించారు.. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి మెల్ల మెల్లగా తొలగిస్తున్నారు. ఇదే సమయంలో జబర్దస్త్ నుండి కూడా ఆయన్ను తొలగించారు అంటూ విమర్శలు వస్తున్నాయి. సుధీర్ ను కనుక మల్లెమాల నుండి తప్పిస్తే మాత్రం ఖచ్చితంగా పరిణామాలు చాలా సీరియస్ గా ఉంటాయంటూ అభిమానులు హెచ్చరిస్తున్నారు.
సుధీర్ మరియు మల్లెమాల టీవీ వారు కలిసి ఉంటేనే ప్రేక్షకులు ఎంటర్ టైన్మెంట్ ను దక్కించుకుంటారు. అలా కాదని సుధీర్ ను తొలగిస్తే మాత్రం ఈటీవీ మసక బారడం ఖాయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ ను బంగారు బాతు అంటారు. అలాంటి బంగారు బాతు కోసం స్టార్ మా మరియు జీ తెలుగు లు కోరుకుంటున్నాయి. కనుక ఒక వేళ మల్లెమాల కనుక సుధీర్ ను వదిలేస్తే అక్కడ ఎంజాయ్ గా సుధీర్ చేరుతాడు. సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో మరింత ముందుకు వెళ్తాడు అనే టాక్ వినిపిస్తుంది. కాని అబిమానులు మాత్రం సుధీర్ ను ఈటీవీలోనే ఉండాలని కోరుకుంటున్నారు.