‘మెగాస్టార్’ అల్లు అర్జున్ వివాదం.. దెబ్బకు దిగొచ్చిన ఆహా టీం

Authored By Admin | The Telugu News | Published on: December 31, 2020, 7:19 pm

మెగాస్టార్ అంటే దాని తరువాత వచ్చే పేరు ఒకే ఒక్కటి అయి ఉండాలి. అది కూడా చిరంజీవి అయి ఉండాలి. మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఆ ట్యాగ్‌కు న్యాయం జరిగినట్టు. కానీ ఆహా టీం మాత్రం తమ హీరో అల్లు అర్జున్‌ను మెగాస్టార్‌ను చేసేసింది. అలా ఊరికే చేసేస్తే అభిమానులు ఎలా ఊరుకుంటారు. ఇన్ని రోజులుగా మెగా ఫ్యాన్స్‌లో బన్నీ మీదున్న కసి అంతా బయటకు వచ్చింది. మొదటి నుంచి మెగా ఫ్యామిలీకి విధేయుడిగా ఉన్న అల్లు అర్జున్ ఈ మధ్య సొంత జెండా, అజెండా, బ్రాండ్‌ను క్రియేట్ చేసుకునే పనిలో పడ్డాడు.

Aha apologize Fans To Calling Allu Arjun as mega star

Aha apologize Fans To Calling Allu Arjun as mega star

మెగా హీరో నుంచి అల్లు హీరో అల్లు బ్రాండ్ అంటూ కొత్త పలుకులు పలుకుతున్నాడు. తనది తాను పెద్ద స్టార్ అని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. అల వైకుంఠపురములో హిట్ అవ్వడంతో అది మరింతగా పెరిగింది. మెగా కాంపౌండ్‌కు దూరంగా అల్లు బ్రాండ్‌ను నిర్మించుకునే పనిలో పడ్డట్టు బన్నీ చర్యలు కనిపించాయి. ఇప్పుడు ఏకంగా ఆహా టీం ద్వారా తనను తాను మెగాస్టార్ అని పిలిపించుకున్నాడు.

ఆహాలో సామ్ జామ్ షోలో బన్నీ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ఈ ప్రోమోలో మెగాస్టార్ అల్లు అర్జున్ అని రాయించుకున్నాడు. దీనిపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో దెబ్బకు దిగొచ్చింది. చిన్న తప్పు వల్ల అలా జరిగింది. మమ్మల్ని క్షమించండి. ఇది వరకులానే మాపై ప్రేమను కురిపించండని ఆహా టీం కోరింది. మనకు తెలుసు ఒక్కే ఒక్క మెగాస్టార్ ఉన్నారు.. అది ఎవరో కూడా అందరికీ తెలుసు అంటూ ఆహా చెప్పుకొచ్చింది.

Admin

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp