Pawan Kalyan : అన్‌ స్టాపబుల్‌ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌ తో ‘ఆహా’ సంపాదించింది ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..!!

Advertisement

Pawan Kalyan : నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‌ స్టాపబుల్‌ కార్యక్రమం సీజన్ 2 ముగింపుకి రెడీగా ఉంది. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో ఈ సీజన్ ముగియబోతున్నట్లుగా ఆహా అధికారికంగా ప్రకటించేసింది. ఈ సీజన్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ప్రభాస్ ఇంకా పలువురు ప్రముఖులను ఆహా తీసుకొచ్చింది. ప్రతి ఎపిసోడ్ కూడా మంచి స్పందన సొంతం చేసుకుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్ ల ఎపిసోడ్ భారీ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.

Aha OTT earned huge revenue with Pawan Kalyan episode
Aha OTT earned huge revenue with Pawan Kalyan episode

ఈ రెండు ఎపిసోడ్స్ కి పెద్ద ఎత్తున స్పాన్సర్స్ కూడా లభించారు. అందుకే ఆహా వారు ఈ రెండు ఎపిసోడ్స్ తోనే భారీగా లాభాన్ని దక్కించుకుని ఉంటారు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఖాతాదారులు పెరగడంతో పాటు స్పాన్సర్స్ ఎక్కువ రావడం వల్ల భారీగా ఆదాయం వచ్చి ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి దాదాపుగా 10 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి ఉంటుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. యూట్యూబ్ ద్వారా మరియు స్పాన్సర్స్ ద్వారా ఇంకా కొత్తగా

Advertisement
Aha OTT earned huge revenue with Pawan Kalyan episode
Aha OTT earned huge revenue with Pawan Kalyan episode

చేరిన ఖాతాదారుల ద్వారా ఈ భారీ మొత్తం దక్కి ఉంటుంది, ఒక పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తోనే బాలకృష్ణ మొత్తం రెమ్యూనరేషన్ తీరి ఉంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఫ్రీగా పవన్ కళ్యాణ్ వచ్చాడా లేదా అనేది తెలియదు కానీ ఆహా వారికి మాత్రం ఆయన రావడం వల్ల భారీగా ఆదాయం అయితే లభించింది. ఇంత ఆదాయం లభించినందుకు ఆహా వారు కచ్చితంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి విరాళం ఇవ్వాల్సిందే అంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరి ఆహా వారు ఆ పని చేస్తారా అనేది చూడాలి.

Advertisement
Advertisement