Taraka Ratna : బాలకృష్ణ దేవుడు రా .. తారకరత్న కోసం ఏం చేసాడో తెలిసి ఏడ్చేసిన అలేఖ్య రెడ్డి ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Taraka Ratna : బాలకృష్ణ దేవుడు రా .. తారకరత్న కోసం ఏం చేసాడో తెలిసి ఏడ్చేసిన అలేఖ్య రెడ్డి !

 Authored By prabhas | The Telugu News | Updated on :5 February 2023,11:00 am

Taraka Ratna : నందమూరి తారకరత్న నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో లోకేష్ కు మద్దతుగా ఆ పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర ప్రారంభించిన కొద్ది సమయంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. గుండెపోటు వచ్చిందని నిర్ధారించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే తారకరత్నకు గుండెపోటు వచ్చిన దగ్గరనుంచి బాబాయి బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారని చెప్పవచ్చు.

Balakrishna risk for Taraka Ratna

Balakrishna risk for Taraka Ratna

గత కొన్ని రోజులుగా తారకరత్న పక్కనే ఉండి మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తున్నాడు బాలయ్య. అయితే తారకరత్న ఆరోగ్యం కుదుటపడాలని బాలయ్య మరో సంకల్పం తీసుకున్నారు. అఖండ దీపారాధన చేపట్టారు. చిత్తూరు జిల్లా చౌడేప‌ల్లి మండ‌లం బ‌త్త‌లాపురంలో మృత్యుంజ‌య‌స్వామి ఆల‌యంలో అఖండ‌జ్యోతి దీపారాధ‌న కొన‌సాగుతోంది. క‌ఠోర‌దీక్ష‌తో నియ‌మ‌బ‌ద్ధంగా అఖండ దీపారాధ‌న కొన‌సాగుతుంది. దీపాల‌ను ప్ర‌మిద‌ల్లో కాకుండా మ‌ట్టి, కంచు పాత్ర‌ల్లో వెలిగిస్తారు. అఖండ‌జ్యోతి దీపారాధ‌న దాదాపు 44 రోజులు కొన‌సాగ‌నుంది.

Balakrishna risk for Taraka Ratna

Balakrishna risk for Taraka Ratna

ఇక తారకరత్న ఆరోగ్యం కూడా రోజురోజుకీ మెరుగవుతుంది. గుండె, కాలేయం పనితీరు సరిగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం మెదడుకు సంబంధించిన చికిత్స జరగనుంది. అయితే తారకరత్న ఆరోగ్యం గురించి బాలయ్య తీసుకున్న శ్రద్ధ అంతా ఇంతా కాదు. మొదటి రోజు నుంచి కూడా బాలయ్య తారకరత్న దగ్గరుండి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అన్న కొడుకుని సొంత కొడుకులా చూసుకుంటున్నాడు. ఎంతో బిజీగా ఉండే బాలయ్య అన్నింటికి విరామం ఇచ్చి ఆస్పత్రికి అంకితమయ్యారు. బాలయ్య తీరు ఆయన అభిమానులను గర్వపడేలా చేస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది