Manirathnam : మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా పొన్నియన్ సెల్వన్. భారీ తారాగణంతో ఈ సినిమాని తెరకెక్కుతుండగా భారీ స్థాయిలో పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక భారీ సెట్ లో పాట చిత్రీకరణను పూర్తి చేశారు. చియాన్ విక్రం, త్రిష, కార్తి, ఐశ్వర్య రాయ్ సహా పలు వురు స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చాలాకాలం తర్వాత మణిరత్నం ఈ సినిమాని తెరకెక్కిస్తుండటంతో అన్ని భాషల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమాతో దాదాపు 5 ఏళ్ళ తర్వాత ఐశ్వర్య రాయ్ గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతోంది. ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో రణబీర్ కపూర్ తో కలిసి నటించిన ఐశ్వర్య రాయ్ మళ్ళీ సినిమాలో నటించలేదు. మళ్ళీ మణిరత్నం సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరం. కాగా సినిమాలో మందాకిని దేవిగా..నందినిగా ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు లేటెస్ట్ అప్‌డేట్. ఒక పాత్రలో పాజిటివ్ గా కనిపిస్తే మరో పాత్రలో విలన్ గా కనిపించబోతోంది. 2021 సౌత్ క్రేజీ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటిగా పొన్నియన్ సెల్వన్ రూపొందుతోంది.
కాగా ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. దర్శక, నిర్మాతలు ఇందుకు భారీ బడ్జెట్ ని కేటాయిచారని అంటున్నారు. ప్రఖ్యాత రచయిత కల్కి కృష్ణమూర్తి చారిత్రక నవల ఆధారంగా ఈ సినిమాని మణిరత్నం తెరకెక్కిస్తున్నాడు. రాజ రాజ చోళ అనే చక్రవర్తి జీవితకథ ను ఈ సినిమాలో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని నాలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక గత కొంతకాలంగా మణిరత్నం కి సక్సస్ లు లేని సంగతి తెలిసిందే. చూడాలి మరి ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ సినిమాలు రూపొందుతున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.