Manirathnam : మణిరత్నం సినిమాలో ఐశ్వర్య రాయ్ డ్యూయల్ రోల్.. నెగిటివ్ రోల్ హైలెట్ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Manirathnam : మణిరత్నం సినిమాలో ఐశ్వర్య రాయ్ డ్యూయల్ రోల్.. నెగిటివ్ రోల్ హైలెట్ ..!

 Authored By govind | The Telugu News | Updated on :23 February 2021,6:52 pm

Manirathnam : మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా పొన్నియన్ సెల్వన్. భారీ తారాగణంతో ఈ సినిమాని తెరకెక్కుతుండగా భారీ స్థాయిలో పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక భారీ సెట్ లో పాట చిత్రీకరణను పూర్తి చేశారు. చియాన్ విక్రం, త్రిష, కార్తి, ఐశ్వర్య రాయ్ సహా పలు వురు స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చాలాకాలం తర్వాత మణిరత్నం ఈ సినిమాని తెరకెక్కిస్తుండటంతో అన్ని భాషల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

aishwarya roy dual role in Manirathnam movie

aishwarya roy dual role in Manirathnam movie

ఇక ఈ సినిమాతో దాదాపు 5 ఏళ్ళ తర్వాత ఐశ్వర్య రాయ్ గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతోంది. ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో రణబీర్ కపూర్ తో కలిసి నటించిన ఐశ్వర్య రాయ్ మళ్ళీ సినిమాలో నటించలేదు. మళ్ళీ మణిరత్నం సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరం. కాగా సినిమాలో మందాకిని దేవిగా..నందినిగా ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు లేటెస్ట్ అప్‌డేట్. ఒక పాత్రలో పాజిటివ్ గా కనిపిస్తే మరో పాత్రలో విలన్ గా కనిపించబోతోంది. 2021 సౌత్ క్రేజీ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటిగా పొన్నియన్ సెల్వన్ రూపొందుతోంది.

Manirathnam : ఇక గత కొంతకాలంగా మణిరత్నం కి సక్సస్ లు లేని సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. దర్శక, నిర్మాతలు ఇందుకు భారీ బడ్జెట్ ని కేటాయిచారని అంటున్నారు. ప్రఖ్యాత రచయిత కల్కి కృష్ణమూర్తి చారిత్రక నవల ఆధారంగా ఈ సినిమాని మణిరత్నం తెరకెక్కిస్తున్నాడు. రాజ రాజ చోళ అనే చక్రవర్తి జీవితకథ ను ఈ సినిమాలో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని నాలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక గత కొంతకాలంగా మణిరత్నం కి సక్సస్ లు లేని సంగతి తెలిసిందే. చూడాలి మరి ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ సినిమాలు రూపొందుతున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది