Singham Again Box Office Day 1 : కమర్షియల్ సినిమాలు తీయడంలో బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టికి సపరేట్ స్టైల్ ఉంది. తనకు ఓ మార్క్ సెట్ చేసుకున్నారు. అందులోనూ అజయ్ దేవగణ్, రోహిత్ శెట్టి కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘గోల్ మాల్’, ‘సింగం’ ఫ్రాంచైజీతో భారీ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు వాళ్లిద్దరూ కలిసి చేసిన సినిమా ‘సింగం ఎగైన్. ఇందులో అర్జున్ కపూర్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం మొదటి రోజున రూ. 43.50 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తుంది .అజయ్ దేవ్‌గన్ కెరీర్‌లో అతిపెద్ద ఓపెనింగ్‌గా నిలిచింది. రూ. 32.09 కోట్లు ‘సింగమ్ రిటర్న్స్’ (2014) చిత్రం సాధించగా, ఇప్పుడు దానిని అధిగమించింది.
ఈ దీపావళికి థియేటర్లలోకి వచ్చిన రోహిత్ శెట్టి ‘సింగం ఎగైన్’ మాత్రమే కాదు. ఇది అనీజ్ బజ్మీ దర్శకత్వం వహించిన హారర్-కామెడీ ‘భూల్ భూలైయా 3’ చిత్రం కూడా మంచి విజయం సాధించింది.. కార్తీక్ ఆర్యన్, ట్రిప్తి డిమ్రీ, విద్యాబాలన్ మరియు మాధురీ దీక్షిత్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతున్నప్పటికీ సింగం ఎగైన్‌ని బీట్ చేయలేకపోతుంది. “హిందీ చిత్ర పరిశ్రమకు ఇది గొప్ప దీపావళి అని చెప్పవచ్చు. ‘భూల్ భూలయ్యా 3’ మరియు ‘సింగం ఎగైన్’ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. వసూళ్లు కూడా భారీగా వస్తున్న నేపథ్యంలో మళ్లీ హిందీ చిత్ర పరిశ్రమకి మంచి రోజులు వచ్చాయని అంటున్నారు.
ఇకసింహం లాంటి పోలీస్ అధికారిని శ్రీరాముడిగా చూపించాలని రోహిత్ శెట్టి ఈ కథ రాసుకోవడంలో తప్పు లేదు. అయితే… ఈ కథకు రామాయణం అవసరం లేదని ప్రతి అడుగులో అనిపిస్తుంది.. రాముడిగా అజయ్ దేవగణ్, హనుమంతునిగా రణవీర్ సింగ్, లక్ష్మణుడిగా టైగర్ ష్రాఫ్, రావణుడిగా అర్జున్ కపూర్… ప్రతి క్యారెక్టర్ ఇంట్రడక్షన్, ఎలివేషన్స్ కోసం సన్నివేశాలు తీసినట్టుగా అనిపించింది. స్టార్స్ అందరినీ ఈ సినిమా చేయడానికి ఒప్పించడంలో, రావణుడిగా అర్జున్ కపూర్ ను తెరపై చూపించడంలో! అర్జున్ కపూర్ సన్నివేశాలు అన్నీ ఎక్స్ట్రాడినరీగా తీశారు. ఫైట్స్, యాక్షన్ సీన్స్ పేలవంగా ఉండటంతో కెజిఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ రీ రికార్డింగ్ కూడా అలాగే ఉంది. సినిమాటోగ్రఫీ కమర్షియల్ సినిమాలకు తగ్గట్టు ఉంది. అర్జున్ కపూర్ సన్నివేశాల్లో మాత్రం బావుంది. ఖర్చు విషయంలో రాజీ పడలేదు. ప్రతి సీన్ గ్రాండ్ స్కేల్ లో ఉంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.