Singham Again Box Office Day 1 : బాక్సాఫీస్ ద‌గ్గర సింగం జోరు.. తొలి రోజు ఏకంగా రూ.43 కోట్ల క‌లెక్షన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Singham Again Box Office Day 1  : బాక్సాఫీస్ ద‌గ్గర సింగం జోరు.. తొలి రోజు ఏకంగా రూ.43 కోట్ల క‌లెక్షన్స్

 Authored By ramu | The Telugu News | Updated on :2 November 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Singham Again Box Office Day 1  : బాక్సాఫీస్ ద‌గ్గర సింగం జోరు.. తొలి రోజు ఏకంగా రూ.43 కోట్ల క‌లెక్షన్స్

Singham Again Box Office Day 1 : కమర్షియల్ సినిమాలు తీయడంలో బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టికి సపరేట్ స్టైల్ ఉంది. తనకు ఓ మార్క్ సెట్ చేసుకున్నారు. అందులోనూ అజయ్ దేవగణ్, రోహిత్ శెట్టి కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ‘గోల్ మాల్’, ‘సింగం’ ఫ్రాంచైజీతో భారీ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు వాళ్లిద్దరూ కలిసి చేసిన సినిమా ‘సింగం ఎగైన్. ఇందులో అర్జున్ కపూర్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం మొదటి రోజున రూ. 43.50 కోట్లు వసూలు చేసిన‌ట్టు తెలుస్తుంది .అజయ్ దేవ్‌గన్ కెరీర్‌లో అతిపెద్ద ఓపెనింగ్‌గా నిలిచింది. రూ. 32.09 కోట్లు ‘సింగమ్ రిటర్న్స్’ (2014) చిత్రం సాధించ‌గా, ఇప్పుడు దానిని అధిగ‌మించింది.

Singham Again Box Office Day 1 భారీ వ‌సూళ్లు..

ఈ దీపావళికి థియేటర్లలోకి వచ్చిన రోహిత్ శెట్టి ‘సింగం ఎగైన్‌’ మాత్రమే కాదు. ఇది అనీజ్ బజ్మీ దర్శకత్వం వహించిన హారర్-కామెడీ ‘భూల్ భూలైయా 3’ చిత్రం కూడా మంచి విజ‌యం సాధించింది.. కార్తీక్ ఆర్యన్, ట్రిప్తి డిమ్రీ, విద్యాబాలన్ మరియు మాధురీ దీక్షిత్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వ‌సూళ్లు రాబ‌డుతున్న‌ప్ప‌టికీ సింగం ఎగైన్‌ని బీట్ చేయ‌లేక‌పోతుంది. “హిందీ చిత్ర పరిశ్రమకు ఇది గొప్ప దీపావళి అని చెప్ప‌వ‌చ్చు. ‘భూల్ భూలయ్యా 3’ మరియు ‘సింగం ఎగైన్’ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. వ‌సూళ్లు కూడా భారీగా వ‌స్తున్న నేప‌థ్యంలో మ‌ళ్లీ హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌కి మంచి రోజులు వ‌చ్చాయ‌ని అంటున్నారు.

Singham Again Box Office Day 1 బాక్సాఫీస్ ద‌గ్గర సింగం జోరు తొలి రోజు ఏకంగా రూ43 కోట్ల క‌లెక్షన్స్

Singham Again Box Office Day 1  : బాక్సాఫీస్ ద‌గ్గర సింగం జోరు.. తొలి రోజు ఏకంగా రూ.43 కోట్ల క‌లెక్షన్స్

ఇక‌సింహం లాంటి పోలీస్ అధికారిని శ్రీరాముడిగా చూపించాలని రోహిత్ శెట్టి ఈ కథ రాసుకోవడంలో తప్పు లేదు. అయితే… ఈ కథకు రామాయణం అవసరం లేదని ప్రతి అడుగులో అనిపిస్తుంది.. రాముడిగా అజయ్ దేవగణ్, హనుమంతునిగా రణవీర్ సింగ్, లక్ష్మణుడిగా టైగర్ ష్రాఫ్, రావణుడిగా అర్జున్ కపూర్… ప్రతి క్యారెక్టర్ ఇంట్రడక్షన్, ఎలివేషన్స్ కోసం సన్నివేశాలు తీసిన‌ట్టుగా అనిపించింది. స్టార్స్ అందరినీ ఈ సినిమా చేయడానికి ఒప్పించడంలో, రావణుడిగా అర్జున్ కపూర్ ను తెరపై చూపించడంలో! అర్జున్ కపూర్ సన్నివేశాలు అన్నీ ఎక్స్ట్రాడినరీగా తీశారు. ఫైట్స్, యాక్షన్ సీన్స్ పేలవంగా ఉండటంతో కెజిఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ రీ రికార్డింగ్ కూడా అలాగే ఉంది. సినిమాటోగ్రఫీ కమర్షియల్ సినిమాలకు తగ్గట్టు ఉంది. అర్జున్ కపూర్ సన్నివేశాల్లో మాత్రం బావుంది. ఖర్చు విషయంలో రాజీ పడలేదు. ప్రతి సీన్ గ్రాండ్ స్కేల్ లో ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది