Romantic Movie Trailer : ఎలాగైనా హిట్ కొట్టాలని.. ఈ సారి ‘రొమాంటిక్’ డోస్ పెంచిన ఆకాశ్ ‘పూరీ‘..!
Romantic Movie Trailer: టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రజెంట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ షూట్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సంగతి అలా ఉంచితే జగన్ తనయుడు ఆకాశ్ పూరీ చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. హీరోగా ‘మెహబుబా’ చిత్రంతో ఇంట్రడ్యూస్ అయ్యాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. కాగా ఈ సారి ఎలాగైనా తనయుడు హిట్ కొట్టాలని అనుకున్నాడో ఏమో తెలియదు కాని ఆకాశ్ పూరీ నటించిన ‘రొమాంటిక్ ’ చిత్రం ట్రైలర్ చూస్తే మాత్రం రొమాన్స్ డోస్ బాగా పెంచేశారని అర్థమవుతున్నది.

Akash Puri ROMANTIC Movie Trailer
ఆకాశ్ పూరీ బాలనటుడిగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన చాలా సినిమాల్లో నటించాడు. ఈ క్రమంలో తన కొడుకును హీరో చేయాలనుకుని పూరీ జగన్నాథ్ ‘మెహబుబా’ సినిమాను డైరెక్ట్ కూడా చేశాడు. ఈ నెల 29న విడుదల కాబోయే ‘రొమాంటిక్’ చిత్రానికి కూడా పూరీ జగన్నాథ్ స్టోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. అనిల్ పడూరి డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నప్పటికీ రొమాన్స్ డోస్ బాగా పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇది ఒక యూనిక్ లవ్ స్టోరిని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Romantic Movie Trailer: హీరో, హీరోయిన్ మధ్య మితిమీరిన సీన్లు..!

Akash Puri ROMANTIC Movie Trailer
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయగా, ప్రజెంట్ అది ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాలో ఆకాశ్ పూరీ సరసన హీరోయిన్‌గా కేతిక శర్మ నటించింది. ఇకపోతే చిత్రంలో సీనియర్ పోలీస్ ఆఫీసర్‌గా రమ్యకృష్ణ నటించింది. సినిమాలోని డైలాగ్స్‌లో పూరీ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మేకింగ్‌లోనే హీరో, హీరోయిన్ సీన్స్ మధ్యలో శ్రుతి బాగా మించిందనే కామెంట్స్ వినబడుతున్నాయి.
