Puri Jagannadh : 80 కోట్లు కొట్టేసి, రోడ్డున పడేసాడు – పూరి జగన్నాథ్ తల్లి సంచలన ఆరోపణలు…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Puri Jagannadh : 80 కోట్లు కొట్టేసి, రోడ్డున పడేసాడు – పూరి జగన్నాథ్ తల్లి సంచలన ఆరోపణలు…!

Puri Jagannadh : తెలుగు ఇండస్ట్రీలో డాషింగ్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు ప్రేక్షకులలో ఒక మార్క్ క్రేజ్ ఉంది. నిర్మాతలకు కూడా పూరి ప్రియమైన దర్శకుడు. కేవలం మూడు నెలల్లోనే మంచి క్వాలిటీ ఉన్న సినిమా తీయగల సత్తా ఉన్న దర్శకులలో ఒకరు పూరి జగన్నాథ్. అయితే కొంతకాలంగా పూరి క్రేజ్ కి తగ్గట్టుగా హిట్ సినిమాలు పడటం లేదు. లైగర్ సినిమా దారుణమైన ఫలితాన్ని అందించింది. ప్రస్తుతం రామ్ పోతినేని తో డబుల్ ఇస్మార్ట్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :31 January 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Puri Jagannadh : 80 కోట్లు కొట్టేసి, రోడ్డున పడేసాడు - పూరి జగన్నాథ్ తల్లి సంచలన ఆరోపణలు...!

Puri Jagannadh : తెలుగు ఇండస్ట్రీలో డాషింగ్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు ప్రేక్షకులలో ఒక మార్క్ క్రేజ్ ఉంది. నిర్మాతలకు కూడా పూరి ప్రియమైన దర్శకుడు. కేవలం మూడు నెలల్లోనే మంచి క్వాలిటీ ఉన్న సినిమా తీయగల సత్తా ఉన్న దర్శకులలో ఒకరు పూరి జగన్నాథ్. అయితే కొంతకాలంగా పూరి క్రేజ్ కి తగ్గట్టుగా హిట్ సినిమాలు పడటం లేదు. లైగర్ సినిమా దారుణమైన ఫలితాన్ని అందించింది. ప్రస్తుతం రామ్ పోతినేని తో డబుల్ ఇస్మార్ట్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే పూరి జగన్నాథ్ కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. స్టార్ డైరెక్టర్ అయ్యాక కూడా ఆయన ఒకానొక పరిస్థితిలో రోడ్డున పడే పరిస్థితికి వచ్చారు. కోట్ల రూపాయలు మోసపోయానని పూరీ కూడా తెలిపారు.

ఈ విషయంపై పూరి జగన్నాథ్ తల్లి అమ్మాజీ తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. నా కొడుకు పడ్డ కష్టం ఎవరూ పడకూడదని, డిగ్రీ పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చి సినిమా ఆఫీస్ ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగాడని, ఏడో తరగతి నుంచే వాడికి సినిమాలంటే పిచ్చి అని, ఒకరోజు హైదరాబాద్ కి వెళ్తే అప్పటికి పూరికి ఇంకా ఛాన్స్ రాలేదని, కాళ్ళు చూస్తే బాగా వాచిపోయి ఉన్నాయని, సాక్సులు వేసుకోవడానికి కూడా కాలేదని, అది చూసి ఏడ్చేశా అని, ఇంత కష్టం ఎందుకు ఊరికి వచ్చేయ్ పొలం పని చేసుకుందాం అని చెప్పానని అన్నారు. కానీ రానని చెప్పాడు. అన్నం తినకుండా మంచి నీళ్లు తాగిన సందర్భాలు ఉన్నాయి. డైరెక్టర్ అయ్యాక పూరి దగ్గర పనిచేసే కుర్రాడు ఒకడు రూ. 80 కోట్లు కొట్టేసి మోసం చేశాడు. ఒక సినిమా వల్ల కూడా నష్టం వచ్చింది.

దీంతో ఒక్కసారిగా కుటుంబంపై పిడుగు పడ్డట్లు అయింది. దీంతో దాదాపు ఐదు ఇల్లులు అమ్మేశాడు. దాదాపుగా వీధిన పడే పరిస్థితి వచ్చింది. మోసం చేసిన వాడి కాళ్ళు చేతులు విరిచేద్దామా అని పూరి స్నేహితుడు ఒకరు సలహా ఇచ్చాడు, పూరి వద్దని చెప్పాడు. వాడికి ఏ జన్మలోనో రుణపడి ఉన్నామో అందుకే ఇలా జరిగింది అని సైలెంట్ అయిపోయాడు. ఒంట్లో సత్తువ ఉన్ననంత వరకు కష్టపడతా అని ఆ విషయాన్ని అంతటితో వదిలేశాడు. నా కొడుకు హృదయం అలాంటిది అని అమ్మాజీ అన్నారు. సొంత ఊరిలో పూరి గుడి కట్టించారు. సాయం అని అడిగిన వారికి లక్షల్లో సహాయం చేశాడు అంటూ తన కొడుకు గురించి అమ్మాజీ చెప్పుకొచ్చారు.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక