Prabhas Puri Jagannadh : రాజా సాబ్ సెట్‌లో ప్రభాస్‌ని కలిసిన పూరీ.. కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడా ఏంటి..?
Prabhas Puri Jagannadh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్లలో ఒకడు పూరీ జగన్నాథ్ . తన కెరీర్‌లో ఎంతో మంది యాక్టర్లకు బ్రేక్ అందించాడు ఈ దర్శకుడు. ఆయన టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా డాషింగ్ డైరెక్టర్‌కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట రౌండప్ చేస్తుంది. పూరీ గ్లోబల్ స్టార్ ప్రభాస్ తో మరోసారి పనిచేయబోతున్నాడన్న క్రేజీ అప్‌డేట్ ఇండస్ట్రీ సర్కిల్‌లో హల్ చల్ చేస్తుంది.

Prabhas Puri Jagannadh : రాజా సాబ్ సెట్‌లో ప్రభాస్‌ని కలిసిన పూరీ.. కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడా ఏంటి..?
Prabhas Puri Jagannadh : ఏది నిజం..
అయితే ఈ ఇద్దరు ఏం సినిమా చేస్తున్నారనే కదా మీ డౌటు. ప్రస్తుతానికి అయితే ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాకు పూరీ డైలాగ్స్ రాస్తున్నాడట. కాప్ డ్రామా నేపథ్యంలో వచ్చిన పోకిరి, టెంపర్ డైలాగ్స్ బాక్సాఫీస్‌ను ఏ స్థాయిలో షేక్ చేశాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మళ్లీ ఇదే జోనర్‌లో రాబోతున్న స్పిరిట్ సినిమా కోసం డైలాగ్స్ రాసే విషయమై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇటీవలే పూరీని సంప్రదించగా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలింనగర్ సర్కిల్ ఇన్ సైడ్ టాక్.
తాజాగా పూరీ జగన్నాథ్.. రాజా సాబ్ సెట్‌లో ప్రభాస్ ని కలవడంతో నెట్టింట అనేక వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇద్దరి కాంబోలో మరో సినిమా రానుందని, స్పిరిట్ కోసం చర్చించడానికి వచ్చాడని ముచ్చటించుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాస్-పూరీ కాంబోలో వచ్చిన ఏక్ నిరంజన్, బుజ్జిగాడు సినిమాల్లోని డైలాగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. ఈ ఇద్దరి కాంబోలో వచ్చే డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.