Akhanda Movie : అఖండ హిట్టా.. ఫట్టా ! బాలయ్య – బోయపాటి కాంబినేషన్ రిపీట్ అయ్యేనా..!
Akhanda Movie నందమూరి బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ మాస్ మసాల చిత్రం అఖండ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ప్రీమియర్ షోలతో మొదలైన ఈ చిత్రం బాలయ్య అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. జై బాలయ్య నినాదాలతో థియేటర్లన్ని దద్దరిల్లి పోతున్నాయి. అసలే బాలయ్య ఫ్యాన్సు… డబుల్ మాస్ సీన్లు, డైలాగ్ లతో బోయపాటి కాంబినేషన్ సినిమా.. ఇక ఊరుకుంటారా! థియేటర్ బయట లోపల రచ్చ రచ్చ చేస్తున్నారు.సినిమా అనౌన్స్ చేసిన దగ్గరినుంచి, ట్రైలర్లు, ప్రోమోల విడుదల వరకు అఖండ సినిమాకు సంబంధించిన ప్రతీ అంశం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వచ్చింది. అయితే తాజాగా వస్తున్న రివ్యూల ప్రకారం.. మూవీకి ఆల్ రెడీ హిట్ టాక్ వచ్చేసింది.
ఈ ప్రకారం చూసుకుంటే వీరిద్దరికీ ఈ చిత్రంతో హ్యాట్రిక్ సొంతమైనట్టే. బాలయ్య సినిమాకు హిట్ టాక్ వస్తే.. వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో ఇంతకు ముందే మనం సింహ, లెజెండ్ సినిమాల విడుదల సమయంలో చూశాం. మరి ఈ సినిమాకు కూడా ఆ మ్యాజిక్ రిపీట్ అవ్వనుందా లేదా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. అఖండ చిత్రానికి బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 53.25 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన ఈ సినిమాను నైజాంలో రూ. 11 కోట్లకు, రాయలసీమ సీడెడ్ లో రూ. 11 కోట్లకు, మరోవైపు ఉత్తరాంధ్రలో రూ. 5.80 కోట్లకు అమ్మినట్లు సమాచారం.

akhanda movie Review And collections in telugu states
Akhanda Movie బోయపాటితో బాలయ్య కాంబినేషన్ రిపీట్ అయ్యేనా..!
ఇప్పటికే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ లు ద్వారా ఈ సినిమాకు దాదాపు 1 మిలియన్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. కరోనా రెండో దశ కారణంగా మూతపడ్డ థియేటర్లు.. మళ్ళీ ఓపెన్ అయ్యాకా విడుదలైన భారీ బడ్జెట్ చిత్రం అఖండ. సినీ ప్రియులు, బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఈ చిత్రం ఏ మేరకు వసూళ్లు రాబడుతుందో వేచి చూడాలి. నటుడు శ్రీకాంత్ ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్, మరియు జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలో నటించారు.