Home » Entertainment » Akhil Akkineni Gets Towards His Fans Response In Theatre Agent Movie
Entertainment

Akhil Agent Movie : పాపం అఖిల్ .. ఫ్యాన్స్ తో సినిమా చూద్దాము అని ఏజెంట్ థియేటర్ కి వెళ్తే !

Authored By
Breaking News 2
The Telugu News | Published on: April 28, 2023, 5:00 pm
Advertisement

Akhil Agent Movie : ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ సినిమా గురించే చర్చ. అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అఖిల్ కు ఒక్క హిట్ కూడా పడలేదు. తాను చిన్నప్పుడు నటించిన సిసింద్రి సినిమాకు వచ్చిన ఫేమ్ ఆయన హీరోగా నటించిన ఏ సినిమాకు రాలేదు. ఇప్పటి వరకు అఖిల్ నటించిన ఏ సినిమాకు సరైన హిట్ దక్కలేదు.

Advertisement

అందుకే దాదాపు మూడేళ్లు కష్టపడి అఖిల్ ఏజెంట్ సినిమాను చేశాడు. ఈ సినిమా మీదే అన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చింది.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. కానీ.. ఈ సినిమాకు ఓవర్సీస్ లో పెద్ద షాక్ వచ్చిపడింది. ఏజెంట్ మూవీ పెద్ద డిజాస్టర్ అంటూ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మిస్ ఫైర్ అయింది అంటున్నారు సినిమా ప్రేక్షకులు. ఈ సినిమాకు సంగీతం అందించిన హిప్ హాప్ తమిళ మ్యూజిక్ కూడా బాగోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Akhil Akkineni Gets Towards His Fans Response In Theatre Agent Movie

 

Advertisement

Akhil Agent Movie : ఫ్యాన్స్ తో కలిసి మూవీ చూసిన అఖిల్

మూసాపేట్ లోని శ్రీరాములు థియేటర్ లో అఖిల్ తన ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూశాడు. నిజానికి ఈ సినిమాకు ఓవైపు డిజాస్టర్ టాక్ నడుస్తున్నా సినిమా విడుదలైంది ఈరోజే కాబట్టి.. ప్రస్తుతం థియేటర్లలో ఏ సినిమా కూడా లేనందున, వేసవి సెలవులు కూడా ఉండటంతో ఈ సినిమాకు అంతో ఇంతో బెటర్ టాక్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక.. ఈ సినిమా కోసం అఖిల్ ఏకంగా 6 ప్యాక్ చేశాడు. బాగా కష్టపడ్డాడు. ఒత్తుగా జుట్టు పెంచుకున్నాడు. చాలా కష్టపడ్డాడు కానీ.. సినిమా హిట్టా.. ఫట్టా అనేది తెలియాలంటే ఇంకొన్ని షోలు పడేదాకా ఆగాల్సిందే.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి