Dhee Show : మూడు నాళ్ల ముచ్చట.. ఢీ నుండి అప్పుడే అతడు జంప్‌

Authored By Himanshi | The Telugu News | Published on: February 28, 2022, 11:00 am

Dhee Show : ఈ టీవీ లో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో కు గత నాలుగైదు సంవత్సరాలుగా మంచి రేటింగ్ వస్తున్న విషయం తెలిసిందే. యాంకర్ గా ప్రదీప్ టీం లీడర్ లుగా సుధీర్, రష్మీ, ఆది వంటి వారు ఉండటం వల్ల గత సీజన్‌ లకు అద్భుతమైన రేటింగ్ రావడం తో పాటు నిర్వాహకులకు మంచి ఆదాయం కూడా వచ్చిందని.. అంతే కాకుండా అందులో కంటెస్టెంట్స్ కి బయట మంచి పేరు కూడా దక్కిందని టాక్ వినిపిస్తోంది. కానీ ఈ సారి మాత్రం కంటెస్టెంట్స్ కు మాత్రమే కాకుండా ఏ ఒక్కరికి కూడా పెద్దగా పేరు వచ్చే అవకాశం కనిపించడం లేదు.ఎందుకంటే షో కు ఏమాత్రం రేటింగ్ రావడం లేదు. దానికి ప్రధాన కారణం ఢీ ఈ సీజన్ నుండి సుధీర్ మరియు రష్మీ ల ను తొలగించడం జరిగింది.

ఆది కొనసాగుతున్నప్పటికీ ఆయనకు సరైన జోడి లేకపోవడంతో ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్‌ రన్నరప్ గా నిలిచిన అఖిల్ మరియు టీవీ నటుడు రవి కృష్ణ ఇంకా కొంత మంది ని తీసుకు వచ్చి కామెడీ చేసే ప్రయత్నం చేశారు. ప్రతి ఎపిసోడ్ లో కూడా ఆది పై చెయ్యి సాధిస్తూ అఖిల్‌ మరియు రవి కృష్ణ లపై కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా అఖిల్ ని దారుణంగా అవమానిస్తూ కామెడీ చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వచ్చాయి.అఖిల్‌ ఇలాంటి కామెడీ కి ఎలా ఒప్పుకున్నాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అఖిల్ ఈ షో లో మూడు నాళ్ళ ముచ్చట అన్నట్లుగా అయ్యింది.

akhil jump from etv dhee dance show he is now biggboss ott

akhil jump from etv dhee dance show he is now biggboss ott

అతడు బిగ్‌ బాస్ ఓటీటీ కి వెళ్లి పోయాడు. బయటకు వచ్చేసి ఇప్పటికే బిగ్బాస్ డిజిటల్ ప్లాట్ఫారంపై సందడి చేస్తున్నాడు. బిగ్ బాస్ ఓటీటీ లో అఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. గతంలో రన్నరప్ గా నిలిచిన తను ఈసారి కచ్చితం గా విజేతగా బయటికి వెళ్తాను అంటూ ధీమాగా చెబుతున్నాడు. అఖిల్ కు పోటీ ఇచ్చేందుకు హౌస్ లో చాలా పెద్ద సంఖ్యలోనే జనాలు ఉన్నారు. అందుకే అఖిల్ఈ సారి టాప్‌ 5 వరకు రావడమే గొప్ప విషయం అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఢీ షోలో విఫలమైన అఖిల్ మరోసారి బిగ్బాస్ లో సక్సెస్ అవుతాడా అనేది చూడాలి.

Himanshi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp