Akhil Akkineni :ఈ సారి ఓ హీరోయిన్‌తో అఖిల్ పెళ్లి చేయాల‌నుకుంటున్న నాగార్జున‌.. గుడ్ న్యూస్ ఎప్పుడంటే..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Akhil Akkineni :ఈ సారి ఓ హీరోయిన్‌తో అఖిల్ పెళ్లి చేయాల‌నుకుంటున్న నాగార్జున‌.. గుడ్ న్యూస్ ఎప్పుడంటే..!

Akhil Akkineni  : అక్కినేని హీరోలకు ఎందుకో కాని పెళ్లి కలిసి రాలేదు ముందుగా వీరి కుటుంబంలో విడాకుల వ్యవహారం మొదలైంది నాగార్జునతోనే. అక్కినేని నాగార్జున మొదట రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటిని పెళ్లి చేసుకోగా, వారు ఆరేళ్ల‌పాటు వైవాహిక జీవితం గ‌డిపారు. ఆ వైవాహిక జీవితంలో నాగ చైతన్య జ‌న్మించాడు. ఆ త‌ర్వాత ల‌క్ష్మీ- నాగ్ విడిపోయారు. ల‌క్ష్మీ అమెరికా వెళ్లిపోగా, నాగార్జున ఇక్క‌డే అమ‌ల‌ని పెళ్లి చేసుకొని అఖిల్‌కి జ‌న్మ‌నిచ్చాడు. ఇక సుమంత్ యార్లగడ్డ […]

 Authored By ramu | The Telugu News | Updated on :23 April 2024,4:00 pm

Akhil Akkineni  : అక్కినేని హీరోలకు ఎందుకో కాని పెళ్లి కలిసి రాలేదు ముందుగా వీరి కుటుంబంలో విడాకుల వ్యవహారం మొదలైంది నాగార్జునతోనే. అక్కినేని నాగార్జున మొదట రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటిని పెళ్లి చేసుకోగా, వారు ఆరేళ్ల‌పాటు వైవాహిక జీవితం గ‌డిపారు. ఆ వైవాహిక జీవితంలో నాగ చైతన్య జ‌న్మించాడు. ఆ త‌ర్వాత ల‌క్ష్మీ- నాగ్ విడిపోయారు. ల‌క్ష్మీ అమెరికా వెళ్లిపోగా, నాగార్జున ఇక్క‌డే అమ‌ల‌ని పెళ్లి చేసుకొని అఖిల్‌కి జ‌న్మ‌నిచ్చాడు. ఇక సుమంత్ యార్లగడ్డ కూడా కెరీర్ మంచి ఫామ్ లో ఉండగా కీర్తి రెడ్డి అనే హీరోయిన్ ని ప్రేమించి రెండేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు . సుమంత్ సోదరి సుప్రియ యార్లగడ్డ కూడా చరణ్ రెడ్డి అనే నటుడిని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. కాని రణ్ రెడ్డి అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆ త‌ర్వాత పెళ్లి చేసుకోలేదు.

Akhil Akkineni  : అఖిల్ పెళ్లి వేళాయే..

ఇక అక్కినేని అఖిల్ శ్రియ భూపాల్ అనే అమ్మ‌యితో ప్రేమ‌లో ప‌డి ఆమెతో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. కాని ఎందుకో తెలియ‌దు వారి రిలేష‌న్ బ్రేక‌ప్ అయింది. రామ్ చరణ్ భార్య ఉపాసన బంధువు అయినా శ్రియ ఇటీవ‌ల పెళ్లి చేసుకోగా, అఖిల్ మాత్రం సింగిల్‌గా ఉంటున్నాడు. అయితే తాజాగా అఖిల్ పెళ్లికి సంబంధించి ఓ వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఆయ‌న ఓ హీరోయిన్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్నాడ‌ని ఇండ‌స్ట్రీలో టాక్ ఉంది. నాగార్జునకు రెండో కోడలిగా కూడా హీరోయినే రాబోతుంది అంటూ ఇప్పుడు ఫిలిం న‌గ‌ర్‌లో జోరుగా ప్ర‌చారాలు సాగుతున్నాయి.

Akhil Akkineni ఈ సారి ఓ హీరోయిన్‌తో అఖిల్ పెళ్లి చేయాల‌నుకుంటున్న నాగార్జున‌ గుడ్ న్యూస్ ఎప్పుడంటే

Akhil Akkineni :ఈ సారి ఓ హీరోయిన్‌తో అఖిల్ పెళ్లి చేయాల‌నుకుంటున్న నాగార్జున‌.. గుడ్ న్యూస్ ఎప్పుడంటే..!

తనతో కలిసి నటించిన ఓ హీరోయిన్ తో అఖిల్ రిలేషన్ లో ఉన్నాడట. సదరు హీరోయిన్ తో -అఖిల్ పీకల్లోతు ప్రేమలో ప‌డ‌డంతో ఈ విష‌యాన్ని త‌న కుటుంబ స‌భ్యుల‌కి తెలియ‌జేశాడ‌ట‌. ఈ సంబంధానికి నాగార్జున, అమల సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలో అధికారికంగా రివీల్ చేస్తారట. అలాగే పెళ్లి ప్రకటన కూడా నాగార్జున‌నే త్వ‌ర‌లో రివీల్ చేయ‌నున్నార‌ని టాక్. ఇక వీరి ప్రేమ వ్య‌వ‌హారం స‌మంత‌, నాగ చైత‌న్య‌ల‌కి కూడా తెలుస‌ట‌. అన్నీ అనుకున్నట్టు జరిగితే అఖిల్ పెళ్లి ఈ ఏడాదిలో జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా, అఖిల్ కి 2016లో శ్రియ భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జ‌ర‌గ‌గా, ఆమెతో కొద్ది రోజుల‌కి విడిపోయాడు. ఇక అక్కినేని ఫ్యామిలీ హీరో నాగ చైత‌న్య స‌మంత‌తో విడిపోయాక శోభిత‌తో రిలేష‌న్ షిప్ మెయింటైన్ చేస్తున్నాడ‌ని త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ ఇవ్వ‌నున్నార‌ని స‌మాచారం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది