akhil most eligible bachelor film not straeming on aha
Most Eligible Bachelor : అక్కినేని నాగార్జున వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన అఖిల్‌కు సరియైన హిట్ సినిమా ఇంత వరకు పడలేదు. కాగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం ఈ నెల 15న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని హిట్ దిశగా సాగిపోతున్నది. ఈ చిత్రం ద్వారా అఖిల్‌కు హిట్ లభించిందని అభిమానులు ఆనందపడిపోతున్నారు. కాగా ఈ సినిమా అప్పుడే ఓటీటీ స్ట్రీమ్ కాబోతున్నదన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ విషయమై మేకర్స్ క్లారిటీనిచ్చారు.అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
akhil most eligible bachelor film not straeming on aha
ఇకపోతే ఈ సినిమా అప్పుడే ఓటీటీలో విడుదల చేయడం లేదని, ప్రొడ్యూసర్ శ్రీనివాస కుమార్ (ఎస్‌కెఎన్) క్లారిటీ ఇచ్చారు. వచ్చే నెల 12న చిత్రం ‘ఆహా’ స్ట్రీమ్ అవుతుందన్న విషయంలో నిజం లేదని స్పష్టతనిచ్చారు. ఈ చిత్రంలో అఖిల్, పూజా హెగ్డే కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుట్ అయిందని, వీరి మధ్య రొమాన్స్ సినిమాలో హైలైట్‌గా నిలిచిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రంలోనూ బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. మొత్తంగా ఈ సినిమా ద్వారా అఖిల్ కెరీర్ సెట్ అయిందని, సాలిడ్ హిట్ అఖిల్ ఖాతాలో నమోదైందని సినీ పరిశీలకులు అంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ దుమ్ము రేపాయి.
akhil most eligible bachelor film not straeming on aha
సినిమా ఏకంగా 5.45 కోట్ల రేంజ్ షేర్ సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగాను ఈ చిత్రానికి అదిరిపోయే కలెక్షన్స్ అందుకుంటుందని సినీ పరిశీలకులు చెప్తున్నారు. ఇకపోతే అఖిల్ తన నెక్స్ట్ మూవీ సక్సెస్ ఫుల్ అండ్ సూపర్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో చేస్తున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తుండగా, ఈ ‘ఏజెంట్’ మూవీ కోసం అఖిల్ బాడీ కూడా బిల్డ్ చేశాడు. ఈ ఫిల్మ్‌ను ఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, సురేందర్ రెడ్డి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ ద్వారా కొత్త అమ్మాయి టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం కానుంది.
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
This website uses cookies.