Home » Entertainment » Akhil Romance With A Girl In Front Of His Father Nagarjuna
Entertainment

Bigg Boss 5 Telugu : తండ్రి నాగార్జున ఎదుటే ఆ అమ్మాయితో రొమాన్స్ చేస్తున్న అఖిల్.. చివరకు ఏమైందంటే?

Authored By
mallesh
The Telugu News | Published on: October 10, 2021, 8:40 pm
Advertisement

Bigg Boss 5 Telugu : టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ ఫిల్మ్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఈ నెల 15న దసరా సందర్భంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీ టీమ్ ‘బిగ్ బాస్’ హౌజ్‌ను సందర్శించింది.

Advertisement

Akhil Romance With A Girl In Front Of His Father Nagarjuna

Bigg Boss 5 Telugu : నాగార్జునకు కౌంటర్ ఇచ్చిన అఖిల్..

‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంలో హీరో అఖిల్ కాగా హీరోయిన్‌గా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. వీరిరువురు ‘బిగ్ బాస్’ హౌజ్ ఎంట్రీ ఇవ్వగా, ఇందుకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా వారు ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. సదరు ప్రోమోలో ‘లెహరాయి’ పాట రాగానే ఎంచక్కా హాయిగా పూజా హెగ్డేతో డ్యాన్స్ చేస్తూ రొమాన్స్ చేస్తున్నాడు అఖిల్. అంతలోనే నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఏంటిది.. అని అఖిల్‌ని అడిగాడు. ‘స్టేజ్ ఈజ్ యువర్స్’ అని ఎవరో చెప్పారు అందుకే ఇలా చేశానని అఖిల్ తండ్రికి సమాధానమిచ్చాడు.

Advertisement

Akhil Romance With A Girl In Front Of His Father Nagarjuna

అలా తండ్రి నాగ్‌కు కౌంటర్ ఇచ్చి నవ్వులు పూయించాడు అఖిల్. ఇకపోతే అఖిల్, పూజ ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్‌తో ముచ్చటించారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ ఎవరైనా పూజను ఇంప్రెస్ చేయొచ్చని చెప్పగా, శ్రీరామ్ ‘నీ కాళ్లను పట్టుకుని వదలన్నవి నా కళ్లు’ అనే పాట పాడి పూజను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. ఇకపోతే యాంకర్ రవి మీమ్స్ చేస్తుంటారని నాగార్జున కౌంటర్ ఇచ్చాడు. ‘బిగ్ బాస్ ఫైవ్ ’ నవరాత్రి స్పెషల్ అనే క్యాప్షన్‌తో విడుదలైన ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘హైపర్’ ఆది కూడా హౌజ్ ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్స్‌పై పంచులు వేశాడు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి